అందాల నయనతార ఎవరెవరితో ప్రేమాయణాలు సాగించిందో వాటి గురించి చెప్పాల్సిన పనిలేదు. కెరీర్ ప్రారంభంలో శింబుతో ప్రేమ... బ్రేకప్..ఇద్దరి సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నయన్ కెరీర్ యూ టర్న్ తీసుకొని ప్రముఖ కొరియోగ్రాఫర్, డైరెక్టర్ ప్రభుదేవాతో ప్రేమాయణం పెళ్లి వరకూ వెళ్లిన సంగతి తెలిసిందే. నయన్-ప్రభుదేవా మూడేళ్లకు పైగా ప్రేమించుకున్నారు. ఏడడుగులు నడవడమే ఇక అనుకున్నారు. మీడియాలో ఈ జంటపై ఒకటే హైప్ గా సెన్షేషనల్ న్యూస్ కూడా నానా రచ్చ చేశాయి. కానీ అనూహ్యాంగా ప్రభుదేవా..నయన్ కి ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. అలా కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఆ బంధానికి అక్కడితో శుభం కార్డ్ పడింది. 

 

తర్వాత ఈ విషయంలోనే నయనతారకు చాలా ప్రశ్నలు ఎదురయ్యాయి. నయన్ నాటి నుంచి తప్పించుకొని కొన్నాళ్ల పాటు కేవలం సినిమా షూటింగ్ లకే పరిమితమైంది. అప్పటి నుంచి మీడియా ఇంటర్వూలకు గానీ.. సినిమా ప్రచారానికి కాని హాజరవ్వడం లేదు. అయితే సినిమా ప్రచారాలకు హాజరవ్వకపోవడ్మ్ పై ఒక ఆసక్తికరమైన విషయాన్ని రీసెంట్‌గా రివీల్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత యంగ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తో ముచ్చటగా మూడోసారి ప్రేమలో లో పడింది. ప్రస్తుతం ఈ జంట పెళ్లి  కూడా చేసుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడిప్పుడే నయన్ మీడియాకు కొత్త విషయాలు చెప్పేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే ఓ ఇంటర్వూలో తన రెండవ లవ్ స్టోరీ  గురించి.. ప్రభుదేవా గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది.

 

ప్రభుదేవాతో విడిపోవడం నిజంగా జీవితం చిన్నాభిన్నామైనంత పనైందని వాపోయింది. ఆ సమయంలో మనసు ముక్కలైందని.. ఏం చేయాలో తోచని స్థితిలో ఒంటరి గా మిగిలి కుమిలిపోయనని తెలిపింది. ఆ ఘటన జరిగి మూడున్నర సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా ఆ బాధ నుంచి పూర్తిగా కోలుకోలేదని.. విఘ్నేష్ తో ఉన్నా ఆ జ్ఞాపకాలు మరువలేకపోతున్నానని భావోద్వేగానికి గురైంది. మరి ఈ విషయంలో తరువాత విఘ్నేష్ కి నయన్ కి ఎలాంటి విభేధాలు తలెత్తుతాయో చూడాలి. గతం గతహ కదా నయన్ ఇప్పుడన్నీ బావున్నాయి కదా..ఇంకా ఎందుకు ఆ జ్ఞాపకాలు గుర్తు చేసుకోవడం అని కొందరు నయన్ కి సూచిస్తున్నారు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: