భారతీయ చలన చిత్ర రంగంలో ఆప్పట్లో స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన ఇండియన్ తెలుగు లో భారతీయుడు బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది.  నేడు దేశ వ్యాప్తంగా ప్రబలిపోతున్న లంచగొండి తనంపై ఓ స్వాతంత్ర సమరయోధుడు చేసిన పోరాటాన్ని ఎంతో గొప్పగా ఆవిష్కరించారు శంకర్.   సేనాపతి అని స్వతంత్ర సమరయోధుడు లంచాలు తీసుకునే వారిని ఒక్కొక్కొరినీ చంపడి..చివరికి తన కొడుకు లంచం తీసుకున్నాడని అతన్ని కూడా చంపేయడం క్లయిమాక్స్..సూపర్ గా తీశారు. 

 

అయితే క్లయిమాక్స్ లో దేశానికి ఏ కష్టమొచ్చినా మళ్లీ వస్తాడు సేనాపతి అని వస్తుంది.. ఈ నేపథ్యంలో ఇండియన్ 2 సీక్వెల్ గా తెరకెక్కిస్తున్నారు. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతున్నమూవీఇండియ‌న్ 2.  దాదాపు రూ.180 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఇండియ‌న్ 2 సినిమాని తెలుగు, తమిళం, హిందీతోపాటు ఇతర భారతీయ భాషల్లోనూ ఏక కాలంలో రూపొందిస్తున్న‌ట్టు తెలుస్తుంది. ఆ మద్య ఈ మూవీ షూటింగ్ విషయంలో ఎన్నో అవాంతరాలు వచ్చాయి.  ఇంతలోనే తమిళనాడు లో ఎన్నికలు రావడం.. కమల్ ఎన్నికల్లో పోటీ చేయడంతో కొంత విరామం వచ్చింది. 

 

అలాగే మేకప్ విషయంలో కూడా నిరుత్సాహం ఉండటం..తర్వాత మార్పులు చేర్పులు చేయడం జరిగింది. ఈ మూవీలో కమల్‌హాసన్‌కి జోడీగా కాజల్ న‌టించ‌నున్నారు . ర‌కుల్ ప్రీత్ సింగ్‌, ప్రియా భ‌వానీ శంక‌ర్, దుల్కర్‌ సల్మాన్‌ కీలక పాత్రల‌లో, అజయ్‌ దేవ్‌గణ్‌ నెగటివ్‌ పాత్రలో నటిస్తారని సమాచారం . లైకా ప్రొడక్షన్స్‌ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తోంది. అనిరుధ్ మూవీకి సంగీతం సమకూర్చుతున్నారు.  అయితే కొద్ది రోజులుగా క‌మ‌ల్‌కి సంబంధించిన మరో పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేస్తున్నారు. దీనిపై చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ ఫేక్ అని తేల్చేసింది. మరి ఈసారి డైరెక్టర్ శంకర్ ఎలాంటి మెసేజ్ ఇస్తారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: