తెలుగు రాష్ట్రాలనే కాదు యావత్ భారత దేశాన్ని ఉలిక్కి పడేలా చేసింది వెటర్నరీ డాక్టర్ దిశ అత్యాచార హత్యోదంతం.  వెటర్నరీ డాక్టర్ దిశను హైదరాబాద్ శివార్లలో ఆరిఫ్, శివ, నవీన్, చెన్నకేశవులు దారుణంగా హతమార్చిన సంగతి తెలిసిందే. దిశ ను అన్యాయంగా అనుభవించిన చంపిన నింధితులను కొట్టి చంపాలి.. నరకాలి... ఉరి తీయాలీ అంటూ దేశం గగ్గోలు పెట్టింది.  దిశ అత్యాచారం.. హత్య జరిగిన జరిగిన 10 రోజులకు వారి ఎన్ కౌంటర్ జరిగింది. ఎన్ కౌంటర్ పై దిశ తల్లిదండ్రులతో పాటు, నిర్భయ తల్లి, బాలీవుడ్, టాలీవుడ్ నటీ నటులు హర్షం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో తెలంగాణ ప్రభుత్వం, పోలీసులపై ప్రశంసల వర్షం కురుస్తోంది. 

 

తాజాగా పూరీ జ‌గ‌న్నాథ్ స్పందించారు. సెల్యూట్‌.. తెలంగాణ పోలీస్ డిపార్టుమెంటుకి చేతులెత్తి మొక్కుతున్నాను. మీరే మా రియ‌ల్ హీరోస్. నేనెప్పుడు ఒక విష‌యాన్ని నమ్ముతాను. మనకి కస్టమొచ్చిన కన్నీళ్లొచ్చినా పోలీసోడే వస్తాడు. ఏ దేవుడికి మొక్కినా ఆ దేవుడు కూడా పంపించేది పోలీసోడినే అంటూ పూరీ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు.

 

ఇక నేచురల్ స్టార్ నాని స్పందిస్తూ.. ఊరికి ఒక్కడే రౌడీ ఉండాలి.. వాడు పోలీసోడు అయ్యుండాలి అని త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

 

హైద‌రాబాద్ పోలీసుల‌కి నా శుభాకాంక్ష‌లు. మిగ‌తా కేసు నిందితుల‌ని కూడా క‌స్టడీలోకి తీసుకోవ‌డం కాక‌, కేసు స్ట‌డీ చేయాల‌ని బాబీ అన్నారు.

 

హీరో ఎన్టీఆర్ స్పందింస్తూ.. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ ను పెట్టిన ఆయన, "న్యాయం జరిగింది. ఇక దిశ ఆత్మ శాంతిస్తుంది" అని వ్యాఖ్యానించారు. 

 

మంచు మనోజ్ స్పందిస్తూ.. నిందితులను ఎన్‌కౌంటర్ చేసేందుకు పోలీసులు ఉపయోగించిన ఆ బుల్లెట్లను దాచుకోవాలని ఉందని, ఆ తుపాకులకు దండం పెట్టాలని ఉందని అన్నాడు. ఎన్‌కౌంటర్ చేసిన ఆ పోలీసుల కాళ్లు మొక్కాలని ఉందని అన్నాడు. నలుగురు చచ్చారనే వార్తలో ఇంత కిక్కు ఉందా? అని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.

 

అక్కినేని నాగార్జున ఈ ఉదయం నిద్ర లేవగానే ఓ వార్తను విన్నాను. న్యాయం జరిగింది" అని టాలీవుడ్ హీరో నాగార్జున వ్యాఖ్యానించారు. నేడు జరిగిన దిశ హత్యాచారం కేసు నిందితుల ఎన్ కౌంటర్ పై సోషల్ మీడియా వేదికగా ఆయన స్పందించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ ను నాగార్జున ఉంచారు.

 

నటి  సమంత  తెలంగాణ పోలీసులకు సెల్యూట్ అని హీరోయిన్ సమంత ట్వీట్ చేశారు. 'భయానికి సరైన సమాధానం దొరికింది. అప్పుడప్పుడు ఇదే పరిష్కారం' అని ఆమె అన్నారు.

 

దిశ హత్యాచార కేసు నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేయడంపై సినీ, క్రీడా ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 'న్యాయం జరిగింది' అంటూ సినీనటుడు అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. 'చివరికి న్యాయం జరిగింది... తెలంగాణ పోలీసులకు నా కృతజ్ఞతలు.. ఆర్ఐపీ దిశ' అని సినీనటుడు విశాల్ ట్వీట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: