నవంబర్ 29 వ తారీఖున హైదరాబాద్ శివారు ప్రాంతం షాద్ నగర్ లో జరిగిన దిశ అత్యాచార ఘటన రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో సంచలనం సృష్టించింది. అయితే ఈ ఘటనకు పాల్పడిన నలుగురు నిందితులను తెలంగాణ పోలీసులు 48 గంటలు గడవకముందే పట్టుకోవడం జరిగింది. నిందితులను పట్టుకొని జైల్లో పెట్టడం తో అప్పటికే సమాజంలో మరియు సోషల్ మీడియాలో నిందితులను బహిరంగంగా వెంటనే ఉరి తీయాలి అందరూ చూస్తుండగానే కాల్చి పారేయాలి అంటూ తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు చేస్తూ కామెంట్లు చేయడం తో తెలంగాణ పోలీసులు చట్టప్రకారం నిందితులకు శిక్ష పడేలా చూస్తామని పేర్కొనడం జరిగింది.

 

దీంతో నలుగురు నిందితులు జైల్లో పెట్టడం తో తెలంగాణ పోలీసులపై మరియు చట్టాలపై భారత దేశ న్యాయ వ్యవస్థ పై తీవ్రస్థాయిలో సోషల్ మీడియాలో విమర్శలు రావడం జరిగాయి. ఇటువంటి పరిస్థితుల్లో శుక్రవారం తెల్లవారుజామున నలుగురు దిశ అత్యాచారానికి పాల్పడిన నిందితులు ఎన్కౌంటర్ అయినట్లు వార్తలు రావడంతో రెండు తెలుగు రాష్ట్రాల తో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజలు ఒక్కసారిగా షాక్ తిన్నారు. కేసు విచారణలో భాగంగా సంఘటనా స్థలానికి నలుగురు నిందితులను తీసుకెళ్లి విచారణ చేయబోతున్న తరుణంలో నలుగురు నిందితులు  పారిపోవడానికి ప్రయత్నించిన సందర్భంలో పోలీసులు వెంటనే అప్రమత్తమై నలుగురు నిందితులను ఎన్కౌంటర్ చేయడం జరిగింది.

 

దీంతో తెలంగాణ పోలీసులపై సోషల్ మీడియాలో మరి ఎలక్ట్రానిక్ మీడియాలో అభినందనల వర్షం కురిపిస్తున్నారు చాలామంది. ముఖ్యంగా మహిళలు సెలబ్రిటీలు మరియు అదే విధంగా రాజకీయ నాయకులు దిశకు ఆత్మశాంతి లభించిందని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తెలంగాణా పోలీసులకు సెల్యూట్ చేసిన పూరి జగన్నాథ్ పోలీస్ డిపార్ట్మెంట్ కి చేతులెత్తి మొక్కుతున్నానని చెప్పారు. 'మీరే నిజమైన హీరోలు.. నేను నమ్మేది ఒక్కటే.. మనకి కష్టమొచ్చినా, కన్నీళ్లు వచ్చినా పోలీసోడే వస్తాడు.. నువ్వే దిక్కు రక్షించాలని దేవుడికి మొక్కినా ఆ దేవుడు కూడా పంపించేది పోలీసోడినే' అంటూ రాసుకొచ్చాడు. దీంతో ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: