దిశ హత్యకేసులో నిందితులను ఈరోజు ఉదయం పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. ప్రియాంక రెడ్డి ఎక్కడ మరణించిందో అక్కడే ఆ నిందితులను కాల్చి పడేశారు పోలీసులు. సీన్ రికర్రెక్షన్ చేసే సమయంలో నలుగురు నిందితులు పారిపోడానికి ప్రయత్నించారు. అయితే ఆ పారిపోతున్న నిందితులపై పోలీసులు కాల్పులు జరపడంతో నలుగురు నిందితులు మృతి చెందారు. 

 

ఈ నేపథ్యంలోనే ఈ ఘటనపై హీరో రామ్ స్పందించారు. అది.. నువ్వు బ్యాడ్ అయితే నేను నీకు మించిన బ్యాడ్ రియల్ లైఫ్ హీరో తెలంగాణ డీజీపీ.. ఇండియా మొత్తం ఇది వినపడాలి అంటూ ట్విట్ చేశారు. ఈ ట్విట్ చుసిన నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ నిందితుల ఎన్కౌంటర్ పై సినీ నాయకుల నుండి రాజకీయ నాయకుల వరుకు ప్రతి ఒక్కరు దిశకు న్యాయం జరిగింది అని కామెంట్లు పెడుతున్నారు. 

 

గత నెల 27వ తేదీన వెటర్నరీ డాక్టర్‌పై అత్యాచారం చేసిన నిందితులు హత్య చేసి చటాన్‌పల్లి వద్ద బ్రిడ్జి కింద శవాన్ని కిరోసిన్ పోసి కాల్చిన సంగతి తెలిసిందే. అదే ప్రదేశంలో పోలీసులు సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో నేరస్తులు నలుగురు దిక్కులేని కుక్క చావు చచ్చారు. ఆ ప్రదేశంలో చీకటిగా ఉన్న పరిస్థితులను అనుకూలంగా చేసుకున్న నిందితులు పోలీసులపై దాడికి దిగారు. 

 

తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఎన్‌కౌంటర్ జరిగింది. అయితే నిందితులను ఘటనకు పాల్పడిన ప్రాంతానికి తీసుకురాగానే అరగంటపాటు విచారణ జరిగిన అనంతరం ఆ నిందితులు పోలీసులపై తిరగబడగా ఆ నిందితులు తుపాకులు లాక్కొని పారిపోతుండగా పోలీసులు జరిపిన కాల్పుల్లో ఆరిఫ్ పాషా, జొల్లు శివ, నవీన్, చెన్నకేశవులు మృతి చెందారు. ప్రస్తుతం ఈ ఘటన దేశం మొత్తం హాట్ టాపిక్ గా మారింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: