బోయపాటి శ్రీను చిన్న సినిమాలు తీయడం ఎప్పుడో మర్చిపోయాడు. బెల్లంకొండ శ్రీను లాంటి చిన్న హీరోతో కూడ బోయపాటి పెద్ద సినిమాలను మాత్రమే తీసాడు. అయితే రామ్ చరణ్ తో బోయపాటి తీసిన ‘వినయ విధేయ రామ’ భంకరమైన ఫ్లాప్ గా మారడంతో బోయపాటి వైపు చూసే నిర్మాతలు హీరోలు కరువైపోయారు. 

ఈ పరిస్థితుల నేపధ్యంలో బోయపాటి చాల కష్టపడి మిరియాల రవీంద్ర రెడ్డి నిర్మాణంలో బాలకృష్ణతో ప్రాజెక్ట్ ను ఓకె చేయించుకున్నాడు. అయితే ప్రాజెక్ట్ ఓకె అయింది కానీ ఈ మూవీ బడ్జెట్ ఎన్ని ప్రయత్నాలు చేసినా 70 కోట్లకుతగ్గడం లేదు అన్న వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం బాలయ్యకు ఏమాత్రం మార్కెట్ లేదు. 

దీనికితోడు ఎన్టీఆర్ బయోపిక్ ఘోర పరాజయంతో బాలయ్య సినిమా పేరు చెపితే బయ్యర్లు భయపడిపోతున్నారు. ఆ భయంతో ఈనెలలో విడుదల కాబోతున్న ‘రూలర్’ మూవీని ఆ మూవీ నిర్మాత కొన్ని ఏరియాలలో విడుదల చేస్తున్నట్లు కూడ వార్తలు ఉన్నాయి. 

ఇలాంటి పరిస్థితులలో బాలయ్య బోయపాటి మూవీ ప్రాజెక్ట్ పై 70 కోట్లు పెట్టడానికి ఈ మూవీ నిర్మాత సాహసించలేక ఈ మూవీ బడ్జెట్ ను తగ్గించమని బోయపాటి పై ఒత్తిడి చేస్తున్నట్లు టాక్. అయితే బోయపాటి మటుకు తాను పెట్టుకున్న 70 కోట్ల బడ్జెట్ పై పట్టుపడుతున్న నేపధ్యంలో ఇప్పుడు ఈ విషయం బాలకృష్ణ వరకు వెళ్ళినట్లు టాక్. తెలుస్తున్న సమాచారం మేరకు ‘రూలర్’ ఫలితం వచ్చిన తరువాత ఈ మూవీ బడ్జెట్ వషయంలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనీ అప్పటి వరకు ఈ సస్పెన్స్ ఇలాగే కొనసాగుతుంది అని అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా క్రేజ్ ను పెంచడానికి బోయపాటి సంజయ్ దత్ రోజాలను ఈ మూవీ ప్రాజెక్ట్ లో భాగం అయ్యేలా ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలు ఫలించని నేపధ్యంలో బాలయ్య బోయపాటి సినిమా సమస్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: