దేశవ్యాప్తంగా దిశ హత్యాచార కేసులో నిందితులను తెలంగాణ పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేయటంతో ఆనంద కేకలు వినబడుతున్నాయి. సరైన న్యాయం దిశ హత్యాచార కేసులో జరిగిందని చాలామంది వివిధ పార్టీల రాజకీయ నేతలు మరియు అదే విధంగా సామాజిక వేత్తలు కామెంట్ చేస్తున్నారు. మొదటిలో కేస్ నమోదైన సందర్భంలో నిందితులను జైల్లో పెట్టిన సందర్భంలో సోషల్ మీడియాలో అదేవిధంగా బహిరంగంగా చాలా మంది విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అంత దారుణంగా ఆడమనిషిని అత్యాచారం చేసి చంపేస్తే నిందితులను న్యాయస్థానం మరియు జైలు అంటూ కాపాడటం పట్ల తీవ్ర విమర్శలు సోషల్ మీడియాలో అలాగే బయట కూడా కావటం జరిగాయి. ఇటువంటి నేపథ్యంలో ఇటీవల శుక్రవారం ఉదయం కేసు విచారణలో భాగంగా సంఘటనాస్థలానికి నిందితులను తీసుకువెళ్లి విచారిస్తున్న క్రమంలో నిందితులు పారిపోవటానికి ప్రయత్నించడంతో తెలంగాణ పోలీసులు వెంటనే నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయటంతో తెలంగాణ పోలీసులపై దేశ వ్యాప్తంగా సర్వత్రా అందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 

ముఖ్యంగా యూపీలో బిఎస్పి అధినేత్రి మాయావతి యూపీ పోలీసులకు... తెలంగాణ పోలీసులను చూసి నేర్చుకోవాలి అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు వర్షం కురిపించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణమైన నేరా సమాజం పెరుగుతున్న ఉత్తరప్రదేశ్ పోలీసులు నిద్రపోతున్నారు అని కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం మాయావతి మీడియాతో మాట్లాడుతూ... ఉత్తర్‌ ప్రదేశ్‌లో మహిళలపై నేరాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి.

 

కానీ, రాష్ట్ర ప్రభుత్వం వీటిపై చర్యలు తీసుకోకుండా మొద్ద నిద్రపోతోందని విమర్శించారు. హైదరాబాద్ పోలీసులను చూసి ఉత్తరప్రదేశ్, ఢిల్లీ పోలీసులు నేర్చుకోవాలని ఆమె సూచించారు. అయితే, యూపీలో మాత్రం దురదృష్టవశాత్తూ నేరగాళ్లను అతిథులుగా చూస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో జంగల్ రాజ్ కొనసాగుతోందని మాయావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తంమీద మాయావతి ఇప్పటికైనా… తెలంగాణ పోలీసులను చూసి ఉత్తరప్రదేశ్ పోలీసులు కళ్ళు తెరవాలని హితవు పలికారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: