మాస్ మహారాజ రవితేజ హీరోగా విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా డిస్కో రాజా. ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి నిర్మాతగా అత్యంత భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్స్ గా తాన్యా హోప్, రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్, నభ నటేష్ నటిస్తున్నారు. ఇక ఈ సినిమా నుండి ఇటీవల రీరిలీజ్ అయిన నువ్వు నాతో ఏమన్నావో అనే సాంగ్ ఆడియన్స్ ను ఎంతో ఆకట్టుకోవడంతో పాటు సినిమాపై అంచనాలు కూడా విపరీతంగా పెంచేసింది. 

 

కాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ని కాసేపటి క్రితం యూట్యూబ్ లో రిలీజ్ చేసారు. మాస్ మహారాజ ఒక డిఫరెంట్ స్టైల్ లో ఈ టీజర్ లో కనపడి అదరగొట్టాడు అనే చెప్పాలి. ఇక ఈ టీజర్ ని బట్టి చూస్తుంటే దర్శకుడు విఐ ఆనంద్ తన గత సినిమాలైన ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం మాదిరిగినా ఈ సినిమాని కూడా ఒక సైన్స్ ఫిక్షన్ స్టోరీగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక టీజర్ లో విజువల్స్ ఎంతో గ్రాండియర్ గా ఉండడంతో పాటు సీన్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయింది. 

 

ఇక మొత్తంగా ఎంతో వెరైటీ గా సాగిన ఈ టీజర్ రిలీజ్ తరువాత సినిమాపై అప్పటి వరకు ఉన్న అంచనాలు మరింతగా పెరిగాయి అనే చెప్పాలి. ఇక హీరోయిన్స్ లో ఒకరైన రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ ది ఈ సినిమాలో కీలక పాత్ర అని తెలుస్తోంది. మరి వరుసగా కొన్నాళ్ల నుండి అపజయాలతో కొట్టుమిట్టాడుతున్న రవితేజకు ఈ సినిమా ఎంత వరకు బ్రేక్ ని ఇస్తుందో చూడాలి. కాగా ఈ సినిమాను అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జనవరి 24న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ టీజర్ పై ఒక లుక్ వేయండి....!!

మరింత సమాచారం తెలుసుకోండి: