నవంబర్ 29వ తారీఖున హైదరాబాద్ శివారు ప్రాంతం షాద్ నగర్ లో జరిగిన దిశ అత్యాచారం హత్య ఘటన యావత్ దేశంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించింది. నిందితులను 48 గంటల్లోనే తెలంగాణ పోలీసులు పట్టుకున్న విమర్శలు మాత్రం తీవ్రస్థాయిలో వెల్లువెత్తాయి. అత్యంత దారుణంగా కిరాతకంగా అత్యాచారం చేసి సజీవదహనం చేయడంతో దిశ అత్యాచారం హత్య ఘటన చేసిన నలుగురు నిందితులను అందరూ చూస్తుండగానే బహిరంగంగా ఉరి తీయాలి అని మరియు అదే విధంగా కాల్చి పారేయాలి వేరే మగవాడు ఇలాంటివి చేయడానికి భయపడాలి అన్నట్టుగా శిక్ష విధించాలి అని చాలామంది సోషల్ మీడియాలో ప్రముఖులు వివిధ పార్టీల రాజకీయవేత్తలు కామెంట్లు చేయడం జరిగింది.

 

ఈ క్రమంలో విచారణలో భాగంగా సంఘటన ప్రదేశానికి నిందితులను తీసుకువెళ్లి విచారణలో నిమిత్తం నిందితులను సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తుండగా, పోలీసులపై వారు దాడి చేసి నలుగురు నిందితులు పారిపోయారు. పారిపోతున్న నిందితులపై పోలీసులు కాల్పులు జరపడంతో తెలంగాణ పోలీసులు నిందితులను అదే ప్రాంతంలో ఎన్ కౌంటర్ చేయడం జరిగింది. దీంతో చాలామంది చేసిన ఎన్ కౌంటర్ పై హర్షం వ్యక్తం చేయగా కొంతమంది ఎన్ కౌంటర్ చేయటం దారుణమని మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదులు చేయాలి అంటూ సోషల్ మీడియాలో గగ్గోలు పెడుతున్న తరుణంలో. పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ స్పందించారు.

 

రేణు స్పందిస్తూ.. ఎన్ కౌంటర్ పై మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేసేవారికి ఏ మాత్రం మానవత్వం ఉందో ఆలోచించుకోవాలని అన్నారు. నిందితులను ఎన్ కౌంటర్ చేయడాన్ని తాను సమర్ధిస్తున్నట్లు చెప్పారు. తప్పా..? ఒప్పా..? ఎందుకు జరిగింది..? ఎలా జరిగింది..? అనే విషయాలను పక్కన పెడితే..జరిగింది మంచిగానే జరిగింది. నిందితులు పరిగెట్టడానికి ప్రయత్నించి వాళ్ల చావును వాళ్లే కొని తెచ్చుకున్నారని.. ఈ ఘటన చూసిన తర్వాత.. మరొకరు ఇలాంటివి చేయాలంటే భయపడతారని.. ఆడపిల్లల గురించి ఆలోచించాలంటేనే భయపడాలని.. ఆ పరిస్థితులు రావాలని అన్నారు. దీంతో రేణుదేశాయ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: