మహారాజ్ రవితేజ  అభిమానులు ఎప్పుడెప్పుడా  అని ఎదురుచూస్తున్న డిస్కో రాజా  టీజర్ కొద్దీ సేపటి క్రితం  విడుదలైయింది.  ఈ టీజర్  వారిని  పూర్తిగా సంతృప్తి పరిచింది. టీజర్ చూస్తుంటే ఈ సారి రవితేజ స్ట్రాంగ్ కంటెంట్ తో వస్తున్నట్లుగా  తెలుస్తుంది. తమన్ బ్యాక్ గ్రౌండ్  స్కోర్ , విజువల్స్  టీజర్ కు హైలైట్స్ గా నిలిచాయి. గత ఏడాది వరుసగా  మూడు సినిమాలతో  నిరాశరపరిచిన రవితేజ  డిస్కోరాజా టీజర్ చూస్తుంటే  ఈ సినిమా తో హిట్ కొట్టాలనే వున్నాడు. 
 
 
 సైన్టిఫిక్   థ్రిల్లర్  నేపథ్యంలో ఎక్కడికిపోతావు చిన్నవాడా ఫేమ్  వి ఐ ఆనంద్  తెరకెక్కిస్తున్న  ఈ చిత్రంలో నాబా నటేష్ , రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ , తాన్యా హోప్ కథానాయికలుగా నటిస్తున్నారు.  వీరితో పాటు ఈ చిత్రంలో రవితేజ  ఫ్రెండ్ పాత్రలో  సునీల్ నటిస్తుండగా విలన్ గా  కోలీవుడ్  హీరో  బాబీ సింహ  కనిపించనున్నాడు.  ఎస్ ఆర్ టి ఎంటర్ టైన్మెంట్స్  బ్యానర్ పై భారీ బడ్జెట్ తో   రవి తాళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది జనవరి 24న ఈచిత్రం  ప్రేక్షకులముందుకు రానుంది. 
 
 
ఈచిత్రం తోపాటు  రవితేజ , గోపిచంద్  మలినేని డైరెక్షన్ లో  క్రాక్ లో నటిస్తున్నాడు. ఇటీవలే ఈ చిత్రం యొక్క షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. ప్రస్తుతం రవితేజసినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు.  ఈ చిత్రం లో  ఆయన  పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు.  కాగా  రవితేజ  గోపించంద్ మలినేని  కాంబినేషన్ లో ఇది మూడో సినిమా.  ఇంతకుముందు  వీరి  కలయికలో  వచ్చిన   డాన్ శీను నిరాశ పరచగా బలుపు సూపర్ హిట్ అయ్యింది. మరి ఈమూడో చిత్రం వీరికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: