రామ్ గోపాల్ వర్మ...వివాదం ద్వారా తన సినిమాలు పబ్లిసిటీ దక్కించుకుని అందరి నోళ్ళలో తన సినిమా పేరును నానేలా చేసే దర్శకుడు ప్రస్తుతం సెన్సార్ ఇచ్చిన షాక్ కి కొంత ఇబ్బందుల్లో ఉన్నాడు. వర్మ సినిమా తీస్తున్నాడంటే, దానిలో ఏదో ఒక వివాదం ఉండి తీరుతుంది. గత కొంత కాలంగా వర్మ నుండి వస్తున్న సినిమాలన్నింటిలో ఎక్కడో ఒక చోట వివాదాస్పద అంశం టచ్ అవుతూనే ఉంది.

 

ఇక ప్రస్తుతం సమకాలీన రాజకీయ అంశాలని తీసుకుని భవిష్యత్తులో ఎలా ఉండబోతుందన్న ఊహతో తీసిన సినిమా "కమ్మ రాజ్యంలో కడప రెడ్లు. ఈ పేరు కులాల మధ్య ఘర్షణల్య్ రేకెత్తించేలా ఉందని అమ్మ రాజ్యంలో కడప బిడ్డలుగా మార్చిన  విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ సినిమాకి సెన్సార్ బోర్డు షాకిచ్చింది. ఈ సినిమాలో తీవ్ర అభ్యంతరకర సన్నివేశాలున్నాయని అందువల్ల సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వబోమని తేల్చి చెప్పింది.

 

రివైజ్ కమిటీ వద్దకి వెళ్ళినా కూడా ఫలితం లేకుండా పోయింది. సినిమాలో దాదాపు ఎనభై శాతం వరకు మార్పులు కోరారట. అయితే అన్ని మార్పులు చెస్తే సినిమానే పోతుంది కాబట్టి వర్మసినిమా థియేట్రికల్ రిలీజ్ ని మానుకుంటాడని అనుకుంటున్నారు.  దాదాపు 80 శాతం సినిమాలో మార్పులు చేర్పులు సూచించారట సెన్సార్ వాళ్లు. రివైజ్డ్ కమిటీ దగ్గర కూడా పనయ్యే అవకాశమే లేదని.. ఇక ఈ సినిమా ఎప్పటికీ థియేటర్లలోకి రాకపోవచ్చని అంటున్నారు. 

 

ఇన్ని మార్పులు చేయడం అయితే అసాధ్యం కాబట్టి థియేట్రికల్ రిలీజ్ మీద ఆశలు వదులుకుని.. డైరెక్ట్‌గా ఆన్ లైన్లో సినిమాను రిలీజ్ చేసేద్దామనే ఆలోచనలో వర్మ ఇప్పుడున్నట్లు చెబుతున్నారు. గతంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ విషయంలో సెన్సార్ నుండి ఇబ్బంది ఎదురైతే యూట్యూబ్ లో రిలీజ్ చేస్తానని చెప్పిన వర్మ ఈ సారి అలా రిలీజ్ చేస్తాడేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: