గత కొన్ని రోజులుగా దిశ హత్య గురించిన ఎన్ని వార్తలు వస్తున్నాయో చూస్తున్నాం. ఆ అమ్మాయిని అమానుషంగా అత్యాచారం చేసి హతమార్చిన ఘటన దేశంలోని ప్రతీ ఒక్కరిని కదిలించింది. ఆ ఘటనకి యావత్ భారతదేశం ఉలిక్కిపడింది. అలా చేసిన వారిని చంపేయాలనే డిమాండ్ యావత్భారతం మొత్తం ప్రతిధ్వనించింది. ఒక అమ్మాయి పట్ల అమానుషంగా ప్రవర్తిస్తే పర్యావసానం ఎలా ఉంటుందో ప్రతీ ఒక్కరికీ తెలియాలంటూ సోషల్ మీడియాలో ప్రతీ ఒక్కరు గళమెత్తారు.

 

దిశ ఉదంతం జరిగిన తర్వాత కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే నిందితులను పోలీసులు పట్టుకున్నారు. ఆ తరువాత వారిని వెంటనే ఉరి తీయాలంటూ దేశ వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున నిరసనల కార్యక్రమం నిర్వహించారు. ఆ పై ఆ నలుగురి నిందుతులని కోర్టులో ప్రవేశపెట్టి ..అక్కడినుండి చర్లపల్లి జైలుకి తరలించారు. జైల్లో ఉన్న నిందుతులని పోలీసులు ఈ నెల 4 వ తేదీన కస్టడీలోకి తీసుకున్నారు.

 

అయితే కేసు డీల్ చేసే క్రమంలో పోలిసులు నిందితులను ఘటన స్థలానికి తీసుకువెళ్తున్న తరుణంలో ఏ౧ నిందితుడైన ఆరిఫ్ పోలీసుల నుండి తప్పించుకోవాలని ప్రయత్నించాడట. మిగతా ముగ్గురు కూడా పోలీసులపై రాళ్ళు రువ్వి తప్పించుకోవాలని చూశారట. పోలిసులు హెచ్చరించినప్పటికీ వాళ్ళు వినకపోవడంతో ఎన్ కౌంటర్ చేయాల్సి వచ్చిందని పోలీసులు తెలిపారు. ఈ విషయం తెలిశాక ప్రతీ ఒక్కరూ సరైన న్యాయం జరిగిందంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

 

ఈ విషయమై నటుడు తనికెళ్ళభరణి స్పందించాడు. "ఒక మహిళను ఎత్తుకెళ్ళిపోయినందుకు రామాయణం జరిగింది.. అలాగే ఒక స్త్రీని అవమానించినందుకు మహాభారతం జరిగింది .. ఇక ఇవాళ ఒక దిశ నిర్దేశం జరిగింది. అసలు ఇలా జరగకూడదు. ఇది ఆటవిక న్యాయం. కానీ పశువులు ఉన్న చోట ఆటవిక న్యాయమే కరెక్టేమో! . ఇప్పటికైనా ఆ అమ్మాయి ఆత్మకు శాంతి కలుగుతుంది అని పోలీసులకు నమస్కారాలు తెలియజేస్తున్నానని తెలిపారు

మరింత సమాచారం తెలుసుకోండి: