బాలీవుడ్ లో అతి తక్కువ కాలంలోనే మంచి పేరు సంపాదించిన హీరోయిన్ ఎవరంటే ఠక్కున గుర్తొచ్చే పేరు అలియా భట్. నిర్మాత మహేష్ భట్ కూతురు గా ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ చేసిన తక్కువ సినిమాల్లో ఆయన కూడా మంచి నటనతో, అందంతో అందరిని ఆకట్టుకుంటూ కెరియర్ లో ముందుకు సాగుతూ ఉంది.

 

ప్రస్తుత కథానాయికల్లో బాలీవుడ్లో ది బెస్ట్ అంటే కచ్చితంగా అలియా భట్ పేరు ఉంటుంది. ఈ సంవత్సరం రాజి సినిమాతో మనందరి ముందరికి వచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమాలో తన నటనతో  విమర్శకుల ప్రశంసలు కూడా పొందింది. అలాగే అవార్డులు కూడా సొంతం చేసుకుంది. ఈ నటన నచ్చడం వల్లనే ఇండియా మోస్ట్ వాంటెడ్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తన తదుపరి చిత్రం ఆర్.ఆర్.ఆర్ కోసం ఏరి కోరి ఎంపిక చేసుకున్నారు. ఈ కుర్ర బ్యూటీ  ఈ సినిమాలో టాలీవుడ్ హీరో రామ్ చరణ్ సరసన నటిస్తుంది . ఈ సినిమాలో రామ్ చరణ్ నటిస్తున్న అల్లూరి సీతారామరాజు పాత్రకు భార్యగా అలియా భట్ కనిపిస్తుంది.

 

టాలీవుడ్ లో నటిస్తూనే బాలీవుడ్లో వరుస సినిమాలతో ఈ నటి చాలా బిజీగా ఉందనే చెప్పాలి. ఎప్పుడు సినిమాలు కాకుండా అప్పుడప్పుడు ఫోటోషూట్ లతో అలరిస్తూ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది ఈ భామ. రణబీర్ కపూర్ తో ప్రేమలో ఉన్న ఈ అమ్మడు, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని ఊహాగానాలు కూడా కనిపిస్తున్నాయి.

 

ఎప్పుడూ, ఏదో ఒక సినిమా వారోత్సవాలు జరిగే బాలీవుడ్లో ఈ మధ్యనే ఫిలింఫేర్ అండ్ స్టైల్ అవార్డ్స్ 2019 కార్యక్రమంలో ఆలయ ఆలియా భట్ తళుక్కుమం.ది ఈ వేడుకల్లో ఆమె వేసుకున్న డ్రస్సు షోలో హైలెట్ గా నిలిచింది. ఆమె అందం ఈ డ్రెస్ లో వర్ణనాతీతంగా ఉందని చెప్పవచ్చు. ఈ వేడుకలో అలియాతో పాటు వరుణ్ ధావన్, బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్లు పాల్గొన్నారు . ప్రస్తుతం బాలీవుడ్లో ప్రియుడు తో నటిస్తున్న బ్రహ్మాస్త్రం చిత్రం త్వరలో రిలీజ్ కు రెడీ గా ఉంది

మరింత సమాచారం తెలుసుకోండి: