సినిమాలు తీయడంలో ఒక్కొక్కరి స్టైల్ ఒక విధంగా ఉంటుంది. బస్ స్టాప్ అనే సినిమాతో తెలుగు సినీ చిత్రం పరిశ్రమలోకి వచ్చాడు డైరెక్టర్ మారుతి .ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో అడల్ట్  కంటెంట్ ఉన్న సినిమాలు తీసేవాడు ఈ దర్శకుడు. కానీ ఆ తర్వాత తన పంథాను మార్చుకొని మొత్తం కామెడీ స్టైల్ లోకి వచ్చేసాడు. ప్రతి దర్శకుడు కామెడీ పండించడంలో ఒక్కొక్కరికి ఒక శైలి ఉంటుంది.

 

కానీ, ఈ తరం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యే సినిమాలు చేశాడు కాబట్టే మారుతి చాలా సినిమాలు సక్సెస్ అయ్యాయి అని చెప్పాలి. ప్రేమ కథ చిత్రం తో ఈయన సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఈ సినిమాలోని కామెడీ టైమింగ్ అలాగే సుధీర్ బాబు, నందిత యాక్టింగ్ చాలా బాగుండడంతో ఈ సినిమా చాలా బాగా జనాలకు కనెక్ట్ అయింది.

 

ఈ దర్శకుడు తాజాగా తీస్తున్న చిత్రం ప్రతి రోజు పండుగ కూడా పాత కథనే అన్నట్లు ఉంది. కానీ, దానికి ఆయన మార్కు కామెడీ ని జత చేసి సినిమాను మరో లెవల్ కి తీసుకెళ్లే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

 

 ప్రస్తుత సమాజంలో టిక్ టాక్ ప్రభావం అంతా ఇంతా లేదు. ఆ ఆలోచనతోనే హీరోయిన్ రాశి ఖన్నాకి ఈ సినిమాలో టిక్ టాక్ ఆడియో అడిక్ట్ అయిన పాత్రనే ఇచ్చాడు దర్శకుడు. ఈ సినిమా కథ ఒక ఒక వ్యక్తి అతను ఆరు వారాల్లో చనిపోతున్నారు అని తెలుస్తుంది. అతనికి తన పిల్లలు, మనవలను ఎక్కడెక్కడో నుంచి వచ్చి ఆయన చివరి కోరిక తీర్చి ప్రశాంతంగా చనిపోవాలని అనుకుంటాడు. ఇది వినడానికి ఏదో శాడ్ స్టోరీ లాగా అనిపించినా కూడా మారుతి తనదైన మార్కుతో ఈ సినిమాని చాలా కామెడీతో నింపాడు అని తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: