సినిమా విజయం అనేది ఇప్పుడు కేవలం స్క్రిప్టు మీదే ఆధారపడి ఉంది. ఇంతకుముందులా ఉండి స్టార్ హీరో ఉండి, నాలుగు ఫైట్లు, నాలుగు పాటలు ఉండి కథ సరిగ్గ లేకపోతే జనాలు థియేటర్లకి రావట్లేదు. ఎంత పెద్ద స్టార్ హీరో ఉన్నా కూడా కథలో కొత్తదనం, కథనంలో వేగం మాత్రమే ప్రేక్షకుడిని థియేటర్ కి తీసుకు రాగలుగుతున్నాయి. అయితే ప్రస్తుతం స్క్రిప్టుల విషయంలో స్టార్ హీరోలు చాలా జాగ్రత్తగా ఉంటున్నారు.

 

 

ఈ జాగ్రత్త కొందరు యువ హిరోల్లో కూడా ఉంది. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ స్క్రిప్టుల విషయంలో చాలా జాగ్రత్త పడుతున్నాడట. మొదట్లో విజయాలు చూసిన సాయి తేజ్ ఒక దశలో మిడ్ రేంజ్ హీరోలలో టాప్ పొజిషన్ కు చేరతాడనే అంచనాలు కూడా వెలువడ్డాయి. ఆ తర్వాత వరుస ఫ్లాపులు రావడంతో అతని ట్రాక్ తప్పింది. దాంతో టాప్ లో కాదు కదా రేసుకోనే లేకుండా పోయాడు. ఈ సంవత్సరం వచ్చిన చిత్రలహరి సినిమా ద్వారా మళ్లీ రేసులోకి వచ్చాడు.

 

సినిమా కథ చాలా కొత్తగా ఉండడంతో ప్రేక్షకులని బాగా మెప్పించింది. అందుకని ఇక నుండి కథలో కొత్తదనం ఉంటేనే సినిమా ఒప్పుకుంటున్నాడట. సాయి తేజ్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో "ప్రతి రొజూ పండగే" సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా డిసెంబర్ ౨౦ వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా కథ కూడా చాలా కొత్తగా ఉంటుందట. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుందట.

 

'చిత్రలహరి' తో తనకు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభం అయిందని.. 'ప్రతిరోజూ పండగే' ప్రేక్షకులకు తప్పనిసరిగా నచ్చుతుందనే ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇకపై మంచి సినిమాల్లో మాత్రమే నటిస్తానని చెప్పాడు. స్క్రిప్టులు ఎంచుకునే విషయంలో జాగ్రత్తగా ఉంటున్నానని తెలిపాడు.  ప్రతిరోజూ పండగే' తర్వాత తేజు 'సోలో బ్రతుకే సో బెటర్' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇదో యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ అని సమాచారం

మరింత సమాచారం తెలుసుకోండి: