దిశ హత్యకేసులో నిందితుల్ని తెలంగాణ పోలీసులు ఎన్ కౌంటర్ చేయడంతో దిశకు న్యాయం జరిగింది.. అంటూ పోలీసులపై రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ప్రశంసలు కురుస్తున్నారు. దిశ (ప్రియాంక) ఆత్మ శాంతిస్తుందని సామాన్య ప్రజానీకంతో పాటు సెలబ్రిటీలు తమదైన శైలిలో స్పందించారు. అయితే బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల హైదరాబాద్ పోలీసుల ఎన్ కౌంటర్ పై  సూటిగ్ ప్రశ్నిస్తూ.. పొగిడేస్తూనే కాస్త తెలివిగా చురకలు అంటించింది. గ్రేట్ వర్క్ హైదరాబాద్ పోలీస్... వియ్ సెల్యూట్ యు...  ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ఉండాలంటే ఇదే శిక్షను అమలు చేయాలి. ఎవరైతే సమాజం విషయంలో బాధ్యత అన్నదే లేకుండా అత్యాచారాలతో తెగబడుతున్నారో వాళ్లందిరికీ ఇదే శిక్ష పడాలి.. అంటూనే ప్రతి రెపిస్ట్ పట్ల పోలీసులు ఇలాగే వ్యవహరిస్తారా? ఇకపై కూడా పోలీసులు ఇలాంటి సంఘటలు జరిగినప్పుడు ఇంతే ధైర్యంతో ముందుకెళ్లాలి అంటూ స్పందించింది గుత్తా.

 

పోలీసులంతా అండర్ లైన్ చేసుకుని నా ఉద్ధేశాన్ని అర్ధం చేసుకోండి! అంటూ క్లారిటి ఇచ్చే ప్రయత్నమూ చేసింది. ఈ వ్యాఖ్యలకు నెటిజనులు మద్దతు గా నిలిచారు. అవును జ్వాల చెప్పింది కరెక్టే. ప్రతీ అత్యాచార ఘటనపై పోలీసులు ఇలాగే వ్యవహరించాలి. మేము మీపై పూల వర్షం కురిపించాలి. మీరే మా రియల్ హీరోలు అంటూ పోలీసుల్ని పొగిడేస్తున్నారు. ఇలాంటివి దేశంలో ఎన్నో జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో నిరంతరం లెక్కకు మించి ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయి.

 

ఎవరో ఒకరు ఏదో రాజకీయ నాయకుడు పేరు చెప్పి తప్పించుకుంటున్నారు. మరి వాళ్ల సంగతేమిటి? దిశ లానే ఎంతో మంది ఆడబిడ్డలు హత్యాచారంలో ప్రాణాలు పోగొట్టుకున్నారు. దిశ ప్రభుత్వ ఉద్యోగి కాబట్టి ప్రభుత్వం ఈ స్థాయిలో రియాక్ట్ అయింది. దేశం మొత్తం ఏకమైంది. ఇలాంటి ఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. మరి ఆ మిగతా బాధితుల పరిస్థితి ఏమిటి? వాళ్లకి న్యాయం జరగాలి కదా? వాళ్లకెప్పుడు న్యాయం జరుగుతుంది. ఈ విషయంలో టాలీవుడ్ సెలబ్రిటీలు ఎందుకు మాట్లాడరు? ఒకరు మాట్లాడితేనే మరొకరు గొంతెత్తుతారా? సమాజంపై వాళ్లకి బాధ్యత లేదా?  అంటూ ఓయూకి చెందిన ఓ పీహెచ్ డీ విద్యార్ధి రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయడం నెటిజనుల్లో సంచలనమైన చర్చకు దారి తీసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: