టాలీవుడ్ దర్శకులు తెలుగు అందాన్ని ప్రోత్సహించరు అన్నమాట గట్టిగా వినిపిస్తోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో నార్త్ ఇండియా అలాగే ముంబై నుంచి వచ్చిన హీరోయిన్లు ఇక్కడ పాగా వేసి అందరు కూడా టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలుతున్నారు అని విమర్శలు వినిపిస్తూ ఉంటాయి. తెలుగు సినిమాలో వచ్చిన తెలుగు అందాలు కొన్ని రోజులు చిన్నా చితక అవకాశాల కోసం వెతికి తర్వాత ఇంకా ఓపిక లేక, ఛాన్సులు రాక కనుమరుగు అయిపోతున్నారు.

 

 రంగస్థలంలో ఆది పినిశెట్టి గా లవర్ గా నటించిన పూజిత పొన్నాడ కూడా తెలుగు అమ్మాయి. ఈ అమ్మాయి నెల్లూరులో పుట్టిన కూడా చెన్నైలో పెరిగింది. ఈ అమ్మాయి షార్ట్ ఫిలింలలో మంచి నటన చేసినట్లు తెలుస్తోం.ది ఈ తెలుగు అందాన్ని సుకుమార్ మరో అవకాశం ఇచ్చారని తెలుస్తోంది. అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తన తదుపరి చిత్రంలో ఈ అమ్మడికి పాత్ర ఉన్నట్టు తెలుస్తోంది.

 

 

కానీ కేవలం నటన మీదనే తన దృష్టి అంతా పెట్టకుండా ఈ అమ్మడు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ స్ట్రాటజీ పాటిస్తూ ఫోటోషూట్ లతో ప్రొడ్యూసర్లని అలాగే అభిమానులు కూడా ఆలోచించేలా ఎప్పుడు లైమ్ లైట్ లో ఉండే విధంగా తన కెరీర్ ని రూపుదిద్దుకుంటుంది.

 

 రెగ్యులర్ గా ఫోటో షూట్లు చేస్తూ ఈ అమ్మడు తన అందాలతో అలరిస్తుంది. ఇప్పటికే పూజిత కు సోషల్ మీడియాలో భారీగా అభిమానులు ఉన్నారు. గత వారంలోనే అల్ట్రా మాడ్రన్ లుక్ తో ఇంస్టాగ్రామ్ లో తన ఫోటోలను అప్లోడ్ చేసిన ఈ అమ్మడు. మళ్లీ ఫోటో షూట్ తో అభిమానులను అలరిస్తుంది. ఈ సారి పసుపు రంగు కలర్ డ్రెస్ లో ఈ అమ్మడు కళ్ళు తిప్పుకోలేని అందంతో ఉంది. ఈ తెలుగమ్మాయి స్పీడు చూస్తూ ఉంటే ఇతర భాషల్లో కూడా అవకాశాలు తెచ్చుకున్నట్లే అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: