తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ హీరో నుంచి స్టార్ హీరో వరకు ఎవరికైనా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో సినిమా చేయాలనుకుంటారు. అంత గొప్ప డైరెక్టర్ మన పూరి. ఎప్పటికైనా దర్శకుడు పూరి జగన్నాధ్ డైరక్షన్ లో ఓ సినిమా చేయాలన్నది తన కోరిక అని హీరో కార్తికేయ కూడా అంటున్నాడు. ఆర్ ఎక్స్ 100, గుణ సినిమాల తరువాత కార్తికేయ చేస్తున్న సినిమా 90 ఎమ్ ఎల్. ఈ సినిమా ఈవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా కార్తికేయ తన మనసులోని కోరికను వెల్లడించాడు. 

 

ఆర్ఎక్స్ 100 సూపర్ హిట్ తరువాత పెద్ద డైరక్టర్లతో సినిమా చేయాలని వుండేదట కార్తికేయకు. అలానే కొన్ని ఆఫర్లు వచ్చినా, కథ నచ్చకపోవడంతో కమిటవలేదట. ఇక చేస్తే పూరి గారితో, అలాగే సుకుమార్ గారితో చేయాలని వుందట. గ్యాంగ్ లీడర్ లో మంచి క్యారెక్టర్ వచ్చింది. అలాంటి క్యారెక్టర్స్ వస్తే ఖచ్చితంగా చేస్తాను గాని  హీరోయిన్ రేప్ చేసి, హీరో చేత తన్నులు తినే సీన్స్ మాత్రం అసలు చేయలేనని, తనకు కెరీర్ కు ఉపయోగపడే పాత్రలు మాత్రమే చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. 

 

హుషారుగా వుండడం వరకు ఇష్టమే..అయితే గతంలో స్టేజ్ మీద కూడా షర్ట్ విప్పి, హడావుడి చేసి, ఆ తరువాత అనవసరంగా చేసాను అని మాత్రం అనుకున్నా అన్నారు. 90 ఎమ్ ఎల్ డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమా అని, ఇందులో క్రేజీ క్యారెక్టర్స్ వుంటాయని, ఖచ్చితంగా జనాలకు నచ్చుతుందని కార్తికేయ ధీమాగా ఉన్నాడు. ఇక సెట్స్ మీద సరదాగా వుంటానని..తన హీరోయిన్స్ లతో స్నేహంగా వుండడమే తప్ప, అంతకు మించి ఏమీ వుండదని ముందుగానే క్లారిటి ఇస్తున్నాడు ఈ కుర్ర హీరో. ఇక కార్తికేయ ప్రస్తుతం ఓ సినిమా కొత్త దర్శకుడితో చేస్తున్నాడట. త్వరలో ఓ పెద్ద బ్యానర్ లో సినిమా చేయబోతున్నానని, ఆ ప్రకటన ఆ బ్యానర్ నుంచే వస్తే అఫీషియల్ గా ఉంటుందని తెలిపాడు. మరి సక్సస్ అవుతుందా లేక మళ్ళీ డిసప్పాయింట్ చేస్తుందా చూడాలి. ఇప్పటికే ఈ సినిమాకు టైటిల్ వివాదంలో చిక్కుకుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: