గతంలో అక్కినేని నాగార్జున అల్లుడు సుశాంత్ హీరోగా అడ్డా అనే మాంచి మాస్ సినిమా తీసిన కార్తీక్ రెడ్డి తెరకెక్కించిన తాజా చిత్రం హీరో హీరోయిన్. భార్గవ్ మన్నె నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్ ఇటీవల విడుదలైంది. పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సినిమాల పైరసీ నేపథ్యంలో సాగే కథ కావడంతో ప్రతీ ప్రేక్షకుడు ఈ సినిమా టీజర్ కు బాగా కనెక్ట్ అయ్యారు. పైరేటెడ్ లవ్ స్టోరీగా ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు కార్తీక్. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాని ఈనెల 27న గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత భార్గవ్ మన్నె మాట్లాడుతూ.. దర్శకుడు జి. కార్తీక్ రెడ్డి మంచి కథ చెప్పారు. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంశాలు పుష్కలంగా ఉండటమే కాకుండా, సరి కొత్త పాయింట్ తో ఈ చిత్రం ఉంటుంది. సినిమా పైరసీ నేపథ్యంలో సాగే ఇంట్రస్టింగ్ స్టోరీ ఇది. 

 

స్లో అండ్ స్టడీ అన్నట్లుగా డిఫరెంట్ రోల్స్ చేసుకుంటూ వస్తున్న హీరో నవీన్ చంద్ర. వేసే పాత్ర హీరోనా? విలన్ నా? క్యారెక్టర్ ? అన్నది చూడకుండా మంచి పాత్రలు ఎంచుకుంటూ, చేసుకుంటూ వస్తున్నాడు. లేటెస్ట్ గా నవీన్ చంద్ర హీరోగా చేసిన సినిమా 'హీరో హీరోయిన్' స్వాతి పిక్చర్స్ బ్యానర్లో నవీన్ చంద్ర, గాయత్రీ సురేష్ హీరో హీరోయిన్లుగా నటించారు. చాలా రోజుల తర్వాత నవీన్ చంద్ర మళ్ళీ హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. 

 

కరెంట్ ట్రెండ్ కి తగ్గ కథ ఇది. హీరో నవీన్ చంద్ర పెర్ ఫార్మెన్స్ నెక్ట్స్ లెవల్ లో ఉంటుంది. డైరెక్టర్ జి.కార్తీక్ రెడ్డి అనుకున్న పాయింట్ ని చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాం. కష్టపడే టీమ్ కుదిరింది. మేకింగ్ లో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా క్వాలిటీ చిత్రాన్ని మా బ్యానర్ ద్వారా అందిస్తున్నాం. ఈనెల 27న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నామని నిర్మాత తెలిపాడు. అయితే మంచి ఫాం లో ఉన్న యంగ్ హీరోలే ఈ మధ్య సరైన హ్జిట్స్ లేక అల్లాడుతుంటే మీకు ఈ హీరో వేశాలు అవసరమా..ఎంచక్కా మంచి క్యారెక్టర్స్ వస్తున్నప్పుడు అవే చేసుకోవచ్చుగా...అనవసరంగా ఎందుకు ఉన్న పేరు కాస్తా చెడగొట్టుకుంటారు..అంటు నెటిజన్లు సలహాలిస్తున్నారు. 

  

మరింత సమాచారం తెలుసుకోండి: