సినిమా అవకాశం రావడమంటే మాటలు కాదు. అందులోనూ త్వరగా వచ్చే పేరు ప్రఖ్యుతులను నిలుపుకునే తెలివి మరింత ముఖ్యం. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. విజయ గర్వం తలకెక్కినా ఇక్కడ చాలా కష్టం. ఇవేమీ తెలీవేమో.. ఆర్ ఎక్స్100 భామ రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ ఇందుకు విరుద్ధంగా వెళ్తోంది. ఆ క్రేజ్ తోనే టాలీవుడ్ సీనియర్ టాప్ స్టార్ విక్టరీ వెంకటేశ్ పక్కన నటించే అవకాశం దక్కించుకుంది.

 

 

వెంకటేశ్ – నాగ చైతన్య కలిసి నటించిన వెంకీ మామ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 13న వెంకటేశ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల కాబోతోంది. ఇప్పటికే విడుదల తేదీ కష్టాలు దాటి ఓ డేట్ సెట్ చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్స్ కు చాలా తక్కువ టైమ్ ఉంది. ఈ నేపథ్యంలో సినిమా యూనిట్ ప్రమోషన్స్ ను క్విక్ స్టార్ట్ గా మెదలుపెట్టేసింది. సురేశ్ బాబు, వెంకటేశ్, రానా, నాగ చైతన్య, రాశి ఖన్నాలతో గ్రాండ్ ప్రెస్ మీట్ ఎరేంజ్ చేసి సినిమాకు ప్రమోషన్స్ మొదలు పెట్టేశారు. కీలకమైన ఈ కార్యక్రమానికి రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ మాత్రం గైర్హాజరైంది. పోనీ.. పాయల్ బిజీ ఆర్టిస్ట్ గా ఉందా అంటే చెప్పుకోదగ్గ సినిమాలు కూడా లేవు. మరి.. అమ్మడు ఈ ప్రోగ్రామ్ కి ఎందుకు డుమ్మా కొట్టిందో తెలీదు.

 

 

అసలే టాలీవుడ్ కి కొత్తగా వచ్చింది. మొదటి సినిమాతోనే యూత్ ని ఆకట్టుకున్న పాయల్ కు టాలీవుడ్ లో మంచి గుర్తింపే వచ్చింది. తర్వాత వచ్చిన సినిమాలు ఏవీ పెద్దగా ఆడకపోయినా క్రేజ్ తగ్గలేదు. ఇలాంటి సమయంలో వచ్చిన పెద్ద అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మరిన్ని అవకాశాలు వస్తాయి. కానీ ఇలా పెద్ద సినిమాకే డుమ్మా కొట్టేస్తే పరిశ్రమలో వ్యతిరేక ముద్ర పడటం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: