ఈ రోజుల్లో స్టార్ హీరోలు సినిమాల నిర్మాణం మీద ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. మార్కెట్ ఎక్కువగా ఉండటం, లాభాలు ఎక్కువగా ఉండటంతో హీరోలు ఎంతో కొంత సినిమాల మీద పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్నారు. రామ్ చరణ్, జూనియర్, మహేష్ బాబు, నానీ ఇలా కొందరు సినిమాలను నిర్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ హక్కులు ఈ హక్కులు అంటూ సినిమాలు విడుదల కాక ముందే భారీగా మార్కెట్ చేస్తున్నాయి. దీనితో పెట్టిన పెట్టుబడి మొత్తం సినిమా నిర్మాణం కి ముందే వచ్చేస్తు౦దనే నమ్మకం ఏర్పడింది.

 

ఇప్పటి వరకు సినిమాలను నిర్మించని జూనియర్ ఎన్టీఆర్ వాటి మీద ఆసక్తి చూపిస్తున్నారని టాక్. ఇదిలా ఉంటే ఇప్పుడు రామ్ చరణ్ సినిమాల నిర్మాణం నుంచి తప్పుకోవాలని భావిస్తున్నారట. దానికి కారణం తన తండ్రితో నిర్మించిన సైరా నరసింహా రెడ్డి సినిమా ఫ్లాప్ కావడమే అంటున్నారు. ఆ సినిమా మీద రామ్ చరణ్ చాలా ఆశలే పెట్టుకున్నాడు. దాదాపు అన్ని భాషలలోను ఆ సినిమాను విడుదల చేసాడు. అయితే సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. కారణాలు ఏంటి అనేది తెలియకపోయినా సినిమా విజయం సాధించలేదు. క‌నీసం ముందుగా అనుకున్న‌ట్టుగా పేరు కూడా రాలేదు.

 

మొత్తం 80 కోట్లే వసూళ్లు వచ్చాయని టాక్. ఈ సినిమా తో దాదాపు 60 కోట్లకు పైగానే చెర్రీ నష్టపోయాడని అంటున్నారు. దీనితో సినిమాల నిర్మాణం విషయంలో ఇక వద్దనే ఆలోచనలో ఉన్నాడట. ఇటీవల ఒక కథతో ఒక దర్శకుడు రాగా తనకు ఆసక్తి లేదని చెప్పేశాడట. కొంత కాలం తర్వాత చూద్దామని... ప్రస్తుతం తాను రాజమౌళి సినిమాతో బిజీ గా ఉన్నాను అని చెప్పాడట రామ్ చరణ్. దాదాపు రెండేళ్ళ వరకు తాను సినిమా నిర్మాణాల జోలికి వెళ్ళేది లేదని... ఇప్పుడు తన దృష్టి అంతా కూడా తర్వాతి ప్రాజెక్టుల మీదే అని వ్యాఖ్యానించాడట. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: