కొన్నేళ్ల నుండి ఈటివి ఛానల్ లో ప్రసారం అవుతున్న జబర్దస్త్ షో గురించి ప్రత్యేకంగా మన తెలుగు వారికి చెప్పనవసరం లేదు. ఇక ఆ షోకు కేవలం ఛానల్ లోనే కాక యూట్యూబ్ లో కూడా వ్యూస్ పరంగా లక్షలాది వ్యూస్ వస్తుంటాయి అంటే, ఆ షో కు ఉన్న క్రేజ్ ఎటువంటిదో అర్ధం చేసుకోవచ్చు. ఇకపోతే ఈ షోలో నటిస్తున్న అనేకమంది పార్టిసిపెంట్స్ ప్రస్తుతం మంచి పేరు ప్రఖ్యాతలతో పలు సినిమాల్లో కూడా అవకాశాలు సంపాదించారు. ఇక ఆ విధంగా మంచి పేరుతో దూసుకెళ్తున్న వారిలో సుడిగాలి సుధీర్ కూడా ఒకరు.

 

మొదట మెజీషియన్ గా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన సుధీర్, ఆ తరువాత హైదరాబాద్ చేరుకొని, అక్కడి ఈటివి ఛానల్ లో ఒక ఉద్యోగం సంపాదించి, 
ఆ తరువాత ప్రారంభం అయిన జబర్దస్త్ షోలో మొదట సాధారణ పార్టిసిపెంట్ గా నలుగురిలో ఒకడిగా కనపడ్డాడు. అనంతరం తన టాలెంట్ తో మరియు ప్రేక్షకాధరణతో మెల్లగా ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ, ఇటీవల తన పేరుతో ఒక టీమ్ ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇకపోతే ప్రస్తుతం సాఫ్ట్ వేర్ సుధీర్ అనే సినిమాలో కూడా హీరోగా నటిస్తున్న సుధీర్, ప్రస్తుతం ఈటివి లో ప్రసారం అవుతున్న అలీతో సరదాగా షోకి ఈవారం గెస్ట్ గా విచ్చేయడం జరిగింది.

 

కాగా రేపు సోమవారం ప్రసారం కాబోయే ఆ ఎపిసోడ్ తాలూకు ప్రోమోని ఈటివి ఛానల్ వారు యూట్యూబ్ లో రిలీజ్ చేయడం జరిగింది. ఆ ప్రోమోలో సుధీర్ మాట్లాడుతూ, తనకు కెరీర్ ప్రశాంతంగా సాగుతుంది అనుకున్న సమయంలో, మధ్యలో కొంత అనారోగ్యం బారిన పడ్డానని, 
దానితో తన ఆరోగ్యం ఎంతో దెబ్బతిని తన పరిస్థితి ఇంట్లో వారికి సైతం ఎంతో భారంగా మారిందని, అటువంటి సమయంలో తనకు మానసికంగా డిప్రెషన్ కలిగి ఎంతో బాధకు గురయ్యానని, ఆ పరిస్థితిని తాను ఎప్పటికీ మరిచిపోలేనని సుధీర్ కొంత ఉద్వేగంతో చెప్పడం జరిగింది. దానితో పాటు తనకు కూడా ఒక లవ్ స్టోరీ ఉందని, తన చిన్ననాటి స్నేహితురాలితో గడిపిన రోజులని సుధీర్ గుర్తుచేసుకుంటూ మాట్లాడాడు. మరి రేపు సోమవారం ప్రసారం కాబోయే ఈ ఫుల్ ఎపిసోడ్ లో సుధీర్ తన గురించి ఇంకెన్ని విషయాలు బయటపెడతాడో చూడాలి....!!

మరింత సమాచారం తెలుసుకోండి: