ఇప్పటికే స్టార్ మా ఛానల్ లో ప్రసారం అయిన బిగ్ బాస్ షో మూడు సీజన్స్ కూడా ఎంతో మంచి పేరు మరియు రేటింగ్స్ తో ముందుకు దూసుకెళ్లిన విషయం తెలిసిందే. ఇక ఈ షో తొలి సీజన్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించగా, రెండవ సీజన్ కు నాచురల్ స్టార్ నాని, అలానే ఇటీవల ముగిసిన మూడవ సీజన్ కు కింగ్ అక్కినేని నాగార్జున హోస్టులుగా వ్యవహరించారు. కాగా మొదటి సీజన్ లో శివబాలాజీ, రెండవ సీజన్ లో కౌశల్ మందా, ఇక మూడవ సీజన్ లో రాహుల్ సిప్లిగంజ్ లు విజేతలుగా నిలవడం జరిగింది. 

 

అయితే ప్రతి సీజన్ కు మరింతగా ఆడియన్స్ లో క్రేజ్ ని పెంచేకుంటూ వెళ్తున్న ఈ షోకు రాబోయే నాలుగవ సీజన్ కు మరొక్కసారి యంగ్ టైగర్ ఎన్టీఆర్ నే హోస్ట్ గా తీసుకోవాలని నిర్ణయించిందట బిగ్ బాస్ యాజమాన్యం. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్న ఎన్టీఆర్, మే సమయానికల్లా పూర్తిగా ఖాళీగా ఉంటారని, ఇక ఆ తరువాత తమ షోని జూన్ లో ప్రారంభించాలని బిగ్ బాస్ యూనిట్ యోచన చేస్తోందట. ఇక నాలుగవ సీజన్ కోసం ఇటీవల ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లి సంప్రదించిందట బిగ్ బాస్ యూనిట్. 
అంతేకాక ఇప్పటివరకు గడిచిన మూడు సీజన్లకు మించేలా ఆయనకు రెమ్యునరేషన్ కూడా ఇవ్వడానికి సిద్ధం అయిందట బిగ్ బాస్ యాజమాన్యం.

 

కాగా ఎన్టీఆర్ కూడా నాలుగవ సీజన్ కే హోస్ట్ గా చేయడానికి చాలావరకు సుముఖత వ్యక్తం చేసారని, అయితే ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తి అయిన తరువాత తనకు వీలున్న సమయాన్ని బట్టి షో ని మొదలెడదాం అని కూడా ఆయన చెప్పినట్లు సమాచారం. మరి ప్రస్తుతం పలు మీడియా మాధ్యమాల్లో విపరీతంగా ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందొ తెలియదు గాని, ఒకవేళ నిజమే అయితే మాత్రం మరొక్కసారి యంగ్ టైగర్ ని బుల్లితెరపై చూసే అవకాశం మనకు దొరుకుతుంది......!!

మరింత సమాచారం తెలుసుకోండి: