రామ్ గోపాల్ వర్మ వివాదాస్పద చిత్రం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సెన్సార్ ఇబ్బందిని ఎదుర్కొంటున్నట్లు తెలిసిందే. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు చిత్రానికి సిబిఎఫ్‌సి సెన్సార్ సర్టిఫికెట్ నిరాకరించింది. ఇప్పుడు తాజాగా, రామ్ గోపాల్ వర్మ తీస్తున్న 'బ్యూటిఫుల్' సినిమా సెన్సార్ ఫార్మాలిటీలను పూర్తి చేసుకుంది, సెన్సార్ బోర్డు నుండి ఎ (అడల్ట్) సర్టిఫికేట్ పొందింది. 

 

రామ్ గోపాల్ వర్మ ’బ్యూటిఫుల్' సినిమా నిన్న సాయంత్రం సెన్సార్ క్లియరెన్స్ పొందగలిగింది, ఆర్జీవీతో సంప్రదించిన తరువాత సినిమా విడుదలను ఆలస్యం చేయాలని పంపిణీదారులు నిర్ణయించారు. రామ్‌ గోపాల్ వర్మ గతంలో తీసిన మ్యూజికల్ బ్లాక్ బస్టర్ రంగీలాకు ఈ బ్యూటిఫుల్ సినిమా నివాళిగా చెప్తున్నారు. ఈ చిత్రంలో నైనా గంగూలీ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు, లక్ష్మిస్ ఎన్టీఆర్ ఫేమ్ అగస్త్య మంజు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. 

 

బ్యూటిఫుల్ సినిమా, రామ్ గోపాల్ వర్మ రంగీలా చిత్రం నుంచి స్ఫూర్తి పొందిందని సమాచారం. ఈ సినిమా రొమాంటిక్ లవ్ స్టోరీ గా తెలుస్తోంది, ఇందులో పార్థ్ సూరి మరియు నైనా గంగూలీ ప్రధాన పాత్రల్లో నటించారు. అక్టోబర్ నెలలో, నిర్మాతలు ట్రైలర్ ను విడుదల చేయగా సోషల్ మీడియాలో ఈ ట్రైలర్ వైరల్ అయింది.

 

ట్రైలర్‌ మొత్తం లిప్ లాక్‌లతో నిండిపోయింది. పార్థ్ సూరి మరియు నైనా గంగూలీ ప్రేమ సాఫీగా సాగే సమయంలో ఉన్నటుండి విషాదకరమైన ముగింపుకు వస్తుంది, ఇదే ఈ సినిమా కథగా తెలుస్తోంది. సెన్సార్ బోర్డు ఈ సినిమాను చూసాక, బ్యూటిఫుల్‌కు  ఎ (అడల్ట్) సర్టిఫికేట్ ఇచ్చింది. అతి త్వరలో ఈ సినిమా విడుదల తేదీకి సంబంధించి నిర్మాతలు అధికారిక ప్రకటన చేయనున్నారు. సెన్సార్ బోర్డు ఎ సర్టిఫికేట్ ఇచ్చినందున గోపాల్ వర్మ ’బ్యూటిఫుల్' సినిమా పెద్దలకు మాత్రమే. ఈ చిత్రాన్ని నరేష్ కుమార్, శ్రీధర్ మరియు యూసుఫ్ షేక్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు, ఇక ఈ సినిమాకి రవిశంకర్ సంగీతం అందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: