దిశ అత్యాచారం హంతకులను తెలంగాణ పోలీసులు శుక్రవారం ఉదయం తెల్లవారుజామున ఎన్ కౌంటర్ చేయడంతో దేశవ్యాప్తంగా ఈ వార్త సంచలనం సృష్టించింది. సరైన న్యాయం తెలంగాణ పోలీసులు చేశారని దిశ అత్యాచారం చేసిన నిందితులకు తగిన న్యాయం జరిగిందని దిశ ఆత్మకు శాంతి చేకూరిందని  సమాజంలో మగాళ్ల రూపంలో ఉన్న కామాంధులు మృగాలు మరొక ఆడదాన్ని పై రేప్ చెయ్యాలనే ఆలోచన రాబోయే రోజుల్లో రాదని తెలంగాణ పోలీసులు దిశా నిందితులను ఎన్ కౌంటర్ చేయడం పట్ల చాలా మంది హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో సెలబ్రిటీలు మరియు చాలామంది పొలిటికల్ లీడర్ లు దేశంలో ఆడవాళ్లపై రోజురోజుకీ అత్యాచారాలు హత్యలు పెరుగుతున్న తరుణంలో తెలంగాణ పోలీసులు ఎన్ కౌంటర్ చేయడాన్ని స్వాగతిస్తున్నామని బహిరంగంగా కామెంట్లు చేయడం జరిగింది.

 

ఇంత త్వరితగతిన తెలంగాణ పోలీసులు దిశ అత్యాచారం కేసులో న్యాయం చేసే విధంగా వ్యవహరించడం చాలా గ్రేట్ మరియు హ్యాట్సాఫ్ అంటూ అభినందనలు తెలుపుతున్నారు. ఇదే గ్రామంలో సోషల్ మీడియా లో చాలా మంది హీరోలు డైరెక్టర్లు తెలంగాణ పోలీసులు చేసిన ఎన్కౌంటర్ పట్ల హర్షం వ్యక్తం చేయడం జరిగింది. హీరోయిన్లు అయితే నిజమైన హీరోలు తెలంగాణ పోలీసులు అని … దేశానికి అసలైన దీపావళి డిసెంబర్ 6న జరిగిందని తెలంగాణ పోలీసుల పై పొగడ్తల వర్షం కురిపించారు.

 

ఇటువంటి నేపథ్యంలో టాలీవుడ్ కుర్ర హీరో నాగ శౌర్య వీడియో రూపంలో దిశ అత్యాచారం హంతకులపై తెలంగాణ పోలీసులు చేసిన ఎన్ కౌంటర్ పై  తనదైన శైలిలో రియాక్ట్ అయ్యాడు. ముందుగా ఎన్కౌంటర్ చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ తెలంగాణ పోలీసులకు హ్యాట్సాఫ్ అంటూ న్యాయం జరిగింది అంటూ ఇంకొకసారి మన తెలంగాణలో మన ఆంధ్రాలో మన ఇండియాలో ఉన్న ఆడవాళ్ళ జోలికి వస్తే మాత్రం ఒక్కొక్కడికి జరిగే పరిస్థితి ఒకటే గుర్తుపెట్టుకోండి ఈరోజు జరిగింది మళ్లీ ఇది రిపీట్ అయితే కుక్కని కాల్చినట్టు కాల్చి పారేస్తారు పోలీసులు ఆడవాళ్ళని గౌరవిద్దాం ఆడవాళ్ళు మన తల్లితో సమానం వాళ్ల జోలికి రావద్దు ఈ సారి చాలా మంది ఎంటర్ అవుతారు అంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: