అక్రమ ఆయుధాల కేసులో ఇరుక్కుని సంజయ్ దత్ జైలుకు వెళ్ళకుండా ఉండి ఉంటే అతడి ఇమేజ్ ముందు బాలీవుడ్ టాప్ హీరోలు ఖాన్ త్రియం కూడ సరిపోరు అన్న విశ్లేషణలు ఉన్నాయి. దాదాపు మూడున్నర సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి సంజయ్ దత్ విడుదలై వచ్చిన తరువాత కూడ అతడికి అవకాశాలు వస్తూనే ఉన్నాయి.

ఈ వారం విడుదలైన బాలీవుడ్ భారీ బడ్జెట్ మూవీ ‘పానిపత్’ లో సంజయ్ దత్ కీలక పాత్ర పోషించాడు. వచ్చే ఏడాది విడుదల కాబోతున్న ‘కేజీ ఎఫ్ 2’ లో సంజయ్ దత్ విలన్ పాత్రను పోషిస్తున్నాడు. లేటెస్ట్ గా మొదలైన బోయపాటీ బాలయ్యల మూవీలో కూడ సంజయ్ దత్ కీలక పాత్రను పోషిస్తున్నాడు అన్న ప్రచారం జరుగుతోంది. 

ఈ నేపధ్యంలో ఈ మధ్య ఒక ప్రముఖ ఇంగ్లీష్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితంలోని ఒక ఆశ్చర్య సంఘటన బయట పెట్టాడు. తాను జైలు శిక్ష అనుభావిస్తున్నప్పుడు తన శిక్షా కాలంలో భాగంగా తన చేత పేపరు కవర్లు చేయించి కవరుకు 10 పైసలు ఇచ్చిన విషయాన్ని గుర్తుకు చేసుకున్నాడు. 


రోజుకు సుమారు 20 రూపాయలు తన సంపాదన ఉండేదని కోట్లల్లో పారితోషికం తీసుకునే తనకు ఆ 20 రూపాయల సంపాదన చూసి చాల ఆవేదన పడిన విషయాలను బయట పెట్టాడు. తాను జైలు శిక్ష అనుభవిస్తున్న కాలంలో తనను చూడటానికి రాఖీ పండుగ రోజున తన వద్దకు వచ్చిన తన చెల్లికి తాను కవర్లతో సంపాదించిన మొత్తం డబ్బులతో ఆమెకు ఒక గిఫ్ట్ కొని ఇస్తే ఆ గిఫ్ట్ తీసుకుని తన చెల్లి తనను కౌగలించుకుని ఏడ్చిన విషయాన్ని గుర్తుకు చేసుకుంటూ ఇప్పటికీ తన జైలు జీవిత జ్ఞాపకాలతో ఒకొక్కసారి నిద్రలో కూడ ఉలిక్కిపడి లేస్తున్నాను అంటూ సంజయ్ దత్ చేసిన కామెంట్స్ అందర్నీ కదిలించి వేసాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: