వరుస ఫ్లాపులతో దిక్కుతోచని స్థితిలో ఉన్న రవితేజ చాలా జాగ్రత్తలు వహించి మరి కథను ఎంపిక చేసుకున్నాడు.. ప్రస్తుతం రవి తేజ నటిస్తున్న తాజా చిత్రం డిస్కో రాజా.. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం భారీ యాక్షన్ సీన్లు చిత్రీకరించారు. హాలీవుడ్ రేంజులో ఉన్నా ఈ సినిమా ఫుల్ గ్రాఫిక్స్ తో కూడుకొని ఉంది.. అయితే రవితేజ ఈ సినిమా హిట్ అవుతుందనే ఆశలు పెట్టుకున్నారు..
చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో ఇటీవల విడుదలైన టీజర్లు, సాంగ్స్, ట్రైలర్స్ ఈ సినిమా పై భారీ అంచనాలను పెంచుతుంది.. డిస్కోరాజా’ మూవీని జనవరి 24న భారీ స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు రామ్ తళ్లూరి చెప్పారు. కాగా, ఈ సినిమాలో రవితేజ సరసన పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్ హీరోయిన్లుగా నటించారు. తాన్యా హోప్, బాబీసింహా, వెన్నెల కిషోర్, సత్య తదితరులు ఇతర పాత్రలు పోషించారు. సాయి రిషిక సమర్పణలో ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రజిని తాళ్లూరి నిర్మించారు. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు..
ఇది ఇలా ఉండగా తాజాగా ఈ చిత్రం నుండి మాస్ మహారాజా రవితేజ ఫ్యాన్స్ కోరుకునే విధంగా యాక్షన్ షాట్స్‌ను డిజైన్ చేశామని దర్శకుడు చెప్పారు. రవితేజ రిట్రో గెటప్‌పై షూట్ చేసిన యాక్షన్ షాట్స్‌ను టీజర్లో పొందుపరిచామని, ఇవి ఫ్యాన్స్‌ను కచ్చితంగా ఆకట్టుకుంటాయని అన్నారు.
టీజర్ స్టార్టింగ్‌లో రవితేజ చెప్పిన డైలాగ్ వైరల్ అవ్వడం ఖాయం అని నిర్మాత రామ్ తాళ్లూరి చెప్పారు. రవితేజ ఫ్యాన్స్‌తో పాటు అన్ని వర్గాల ఆడియన్స్‌కి నచ్చే విధంగా ‘డిస్కోరాజా’ని సిద్ధం చేస్తున్నామన్నారు. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో చాలా మంది ప్రముఖులు నటిస్తున్నారు అంటున్నారు.. కొత్త లుక్ తో రవితేజ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు.. మరి ఈ సినిమా రవితేజకు హిట్ ను ఇస్తుందో లేదో తెలియాలంటే కొద్దిోజులు వెయిట్ చేయాల్సిందే..