‘రూలర్’ విడుదల కాకుండానే నిన్న బాలకృష్ణ బోయపాటి మూవీకి పూజా కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ షాట్ లో కూడ నటించాడు. ‘నువ్వొక మాట అంటే అది శబ్దం అదే మాట నేనంటే అది శాసనం’ అంటూ బాలయ్య చెప్పిన పంచ్ డైలాగ్ తో నిన్న ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయింది. 


దీనితో బాలయ్య అభిమానులు కోరుకునే ఇలాంటి మాస్ పంచ్ డైలాగ్స్ ఈ మూవీలో ఎన్నో ఉంటాయని బోయపాటి లీకులు ఇస్తున్నాడు. ఇదే సందర్భంలో బాలయ్య మాట్లాడుతూ ఒక షాకింగ్ కామెంట్స్ చేసాడు. చాలామంది హీరోలకు కథలు పుట్టుకు వస్తాయని అయితే తన ఆవేశం నుండి సినిమా కథలు పుట్టుకు వస్తాయి అంటూ టాప్ హీరోలలో తన రేంజ్ వేరు అన్న సంకేతాలు ఇచ్చాడు. 


నిన్నటి ఫంక్షన్ లో బోయపాటి మాటలను బట్టి ఈ మూవీకి సంబంధించిన హీరోయిన్ కానీ అదేవిధంగా విలన్ పాత్రలో సంజయ్ దత్ కానీ ఫిక్స్ కానట్లు తెలుస్తోంది. బోయపాటి తన సినిమాలను చాల వేగంగా తీస్తాడు కాబట్టి అన్నీ కుదిరితే ఈ మూవీని వచ్చే ఏడాది సమ్మర్ రేస్ కు విడుదల చేసే ఆస్కారం ఉంది. 


గతం గురించి మాట్లాడకుండా కేవలం ఈ సినిమా గురించి మాత్రమే బాలయ్య అభిమానులు మాట్లాడుకుంటారు అని బోయపాటి చెపుతున్న మాటలను బట్టి ఈ మూవీ పై బోయపాటికి ఎంత నమ్మకం ఉందో అర్ధం అవుతుంది. 100  సినిమాలకు పైగా బాలకృష్ణ నటించినా ఇప్పటి వరకు అతడి సినిమాలకు 150 కోట్ల మార్క్ ను అందుకోలేకపోయాయి. ఆ మార్క్ ను బోయపాటి మూవీ అందించగలిగితే బాలయ్య అభిమానుల ఆనందానికి హద్దులు ఉండవు. దీనితో ఈ మూవీ విడుదల గురించి బాలయ్య అభిమానులు మాత్రమే కాకుండా తెలుగుదేశం పార్టీ వర్గాలు కూడ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: