యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్న అక్షయ్ కుమార్ కు బాలీవుడ్ లో అరుదైన రికార్డు ఉంది. ఖన్ ల త్రయాన్ని అత్యద్భుతంగా ఢీ కొట్టిన హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఖాన్ ల హవా ఇప్పటికీ బాలీవుద్ లో నడుస్తూనే ఉంది. వారి దరిదాపుల్లోకి వచ్చే హీరోనే లేడు. కానీ వారి సినిమా కలెక్షన్లను మాత్రం అక్షయ్ అధిగమిస్తూంటాడు. ఫ్లాపులెదురైనా ధైర్యంగా ముందుకెళ్లే ఈ బాలీవుడ్ యాక్షన్ హీరోపై ఓ మచ్చ ఉండిపోయింది. అది.. ఆయన భారతీయ పౌరసత్వంపై!

 

 

అక్షయ్ కు భారతీయ పౌరసత్వం లేదని ఇప్పటికే చాలాసార్లు చాలామంది క్రిటిక్స్ వేలెత్తి చూపించారు. దీనిపై అనేకసార్లు విమర్శలు ఎదుర్కొన్నాడు అక్షయ్. భారతీయ పౌరసత్వం లేకుండా జాతీయతా భావం ఉట్టిపడే సినిమాలు, దేశభక్తి సినిమాలు ఎలా చేస్తావ్.. ఇండియా గురించి నీతి సూక్తులు చెప్పే అర్హత నీకు లేదంటూ అనేక విమర్శలు వచ్చాయి. కానీ.. వీరి విమర్శలన్నీ నిజం చేస్తూ అక్షయ్ చెప్పిన సమాధానం వార్తల్లో నిలిచింది. తనకు భారతీయ పౌరసత్వం లేదని చెప్పాడు. ‘ఓదశలో తనకు వరుస ఫెయిల్యూర్స్ వచ్చాయి. ఆ సమయంలో స్నేహితులు తనను కెనడా వచ్చేయమన్నారు. దీంతో భారతీయ పౌరసత్వం రద్దు చేసుకుని కెనడా పౌరసత్వం తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడి పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నాను’ అన్నాడు. దీంతో విమర్శలకు తన సమాధానం చెప్పుకొచ్చాడు.

 

 

అక్షయ్ కుమార్ కు బాలీవుడ్ లో మంచి రికార్డులే ఉన్నాయి. 2019లో ఆయన నటించిన సినిమాల ద్వారా దాదాపు 1000కోట్లు కలెక్షన్లు సాధించిన హీరోగా రికార్డు సృష్టించాడు. సల్మాన్ పేరిట ఉన్న రికార్డును ఆయన చెరిపేసాడు. ఖాన్ ల ఆధిపత్యాన్ని ఢీకొట్టిన హీరోగా నిలిచాడు. ఇంత ఘనత ఉన్నా పౌరసత్వం విషయంలో మాత్రం విమర్శలకు గురవుతున్నాడు. మరి అక్షయ్ కు మళ్లీ భారతీయ పౌరసత్వం ఎప్పుడొస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: