సినిమాలు ఎక్కువగా యూత్ ని టార్గెట్ చేసి తీస్తుంటారు. థియేటర్లకి ఎక్కువగా వచ్చేది వాళ్ళే వాళ్ళ గురించే సినిమాల్లో చూపిస్తుంటారు. అయితే ఫ్యామిలీస్ ని కూడా థియేటర్లకి తిసుకొచ్చే దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు. అలా తక్కువ మందిలో మారుతి కూడా చేరిపోయారు. భలే భలే మగాడివోయ్ సినిమాతో ఆ గుర్తింపు తెచ్చుకున్నారు మారుతి. అంతకుముందు మారుతి కూడా యూత్ ని బేస్ చేసుకునే సినిమాలు చేశారు.

 

 

ఆ తర్వాత ఫ్యామిలీలకి దూరమవుతున్నానని అనుకున్నారో ఏమో కానీ సినిమాల విషయంలో చాలా ఛేంజ్ వచ్చింది. మారుతి ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ హీరోగా ప్రతి రోజూ పండగే అనే సినిమాని తెరకెక్కించాడు. రాశీ ఖన్నా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా డిసెంబర్ ఇరవై తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే మారుతిని ఒక సెంటిమెంట్ వెంటాడుతోంది. ఒక  ఫ్లాప్ తర్వాత  హిట్ ఒక రావడం అతనికి అలవాటుగా మారింది.

 

 

ఒక పెద్ద సూప‌ర్ హిట్ ఇచ్చాక త‌న‌పై పెట్టుకునే భారీ అంచ‌నాల్ని అత‌ను అందుకోలేక‌పోతున్నాడు. భ‌లే భ‌లే.. త‌ర్వాత మారుతి తీసిన బాబు బంగారు ఫ్లాప్ అయిన సంగ‌తి తెలిసిందే. అయితే త‌న‌పై అంచ‌నాలు త‌గ్గిన స‌మ‌యంలో మ‌హానుభావుడుతో మ‌ళ్లీ హిట్ కొట్టి త‌నేంటో రుజువు చేసుకున్నాడు మారుతి. కానీ ఆ త‌ర్వాత అంచ‌నాలు పెంచుకుంటే శైల‌జా రెడ్డి అల్లుడు లాంటి ఫ్లాప్ అందించాడు.

 

 

శైలాజా రెడ్డి తర్వాత ప్రతి రోజూ పండగే సినిమా వస్తుంది కాబట్టి ఈ సినిమా పక్కా హిట్ అవుతుందని అంటున్నారు. మారుతి సెంటిమెంట్ ఈ సినిమాకి పనిచేస్తుందనే భావనలో ఉన్నారు. ఇప్పటికైతే సినిమా ట్రైలర్ చూస్తే ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులని అలరిస్తుందని తెలుస్తుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: