ప్రస్తుతం సంగీత దర్శకుడు థమన్ కోసం సినిమా దర్శకులు క్యూ కడుతున్నారు. థమన్ చేతిలో అరడజను పైగానే సినిమలు ఉన్నాయి. మహానుభావుడు,  తొలిప్రేమ సినిమాల నుండి అతడి సంగీతంలో చాలా మార్పొచ్చింది. అంతకుముందు కేవలం బీట్ మాత్రమే వినిపించేది. కానీ మహానుభావుడు సినిమా నుండి అతని పంథా పూర్తిగా మారిపోయింది. పాటల్లో సాహిత్యానికి ఎంత ఇంపార్టెన్స్ ఉందో గుర్తించినట్టున్నాడు. 

 

 

అదీ గాక అతని సంగీతంలో మెలొడీలకి అంతగా స్థానమ్ లేకపొయేది. కానీ ప్రస్తుతమ్ మెలొడీలతో అలరిస్తున్నాడు. అరవింద సమేత సినిమాలో మ్యూజిక్ ప్రేక్షకులని ఎంతగా అలరించిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. సాధారణంగా త్రివిక్రమ్ ఎక్కువగా దేవిశ్రీ ప్రసాద్ తోనే మ్యూజిక్ చేయించుకుంటాడు. అలాంటిది థమన్ తో చేయించుకుంటున్నాడంటే అందరూ అనుమానించారు కానీ ఆ అనుమానాలన్ని పటా పంచలయ్యాయి.

 

 

ఇక ఇప్పుడు బన్నీ తో చేస్తున్న "అల వైకుంఠపురములో" చిత్రానికి కూడా థమనే మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమాలోని పాటలు ఎంత పాపులర్ అయ్యయో తెలిసిందే. ఈ పాటల ద్వారానే సినిమాకి చాలా హైప్ వచ్చింది. అదీ గాక వచ్చే వారం విడుదల కాబోయే 'వెంకీ మామ' అతడి సినిమానే. ఆ తర్వాతి వారం క్రిస్మస్ కానుకగా రిలీజయ్యే 'ప్రతిరోజూ పండగే' తమన్ చిత్రమే. ఇంకా రవితేజ "డిస్కో రాజా"కి కూడాకి థమన్ స్వరాలు సమకూరుస్తున్నాడు.

 

 

రవితేజ తర్వాతి చిత్రానికి కూడా థమనే మ్యూజిక్ డైరెక్టర్. ఇక నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను సినిమాకు కూడా తమనే మ్యూజిక్ డైరెక్టర్ అంటున్నారు. 'సరైనోడు'కు మాత్రం తమన్‌ను పెట్టుకున్నాడు. మంచి ఔట్ పుట్ ఇచ్చినా.. తర్వాత అతడితో పని చేయలేదు. ఎప్పట్లాగే తర్వాతి చిత్రానికి దేవిశ్రీతోనే సంగీతం చేయించుకున్నాడు. కానీ బాలయ్య కొత్త సినిమాకు మాత్రం తమన్‌నే ఎంచుకున్నాడట. ఇదంతా చూస్తుంటే థమన్ జోరు కనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: