హీరోలకు తగ్గ కథలు రాస్తారు కొందరు దర్శకులు. ఇండస్ట్రీలోని కుటుంబాలకు తగ్గ కథలు రాస్తారు మరికొందరు. ఈ రెండింటినీ మిక్స్ చేసి కథ రాస్తే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అటువంటి ప్రయత్నమే చేసినట్టున్నాడు దర్శకుడు బాబీ. ఆయన దర్శకత్వంలో దగ్గుబాటి ఫ్యామిలీ – అక్కినేని ఫ్యామిలీ హీరోలను కలిపి సినిమా చేసి ఔరా అనిపించుకున్నాడు. రియల్ లైఫ్ లో మామా అల్లుళ్లయిన వెంకటేశ్ – నాగ చైతన్యను కలిపి రీల్ లైఫ్ లో కూడా అదే టైటిల్ వెంకీమామగా సినిమా తీశాడు. ఈ సినిమా ఈ నెల 13న విడుదల కానుంది.

 

 

మల్టీస్టారర్ తీయడమంటే సామాన్యమైన విషయం కాదు. ఎక్కడైనా వర్కౌట్ అవుతుందేమో కానీ మన తెలుగులో మాత్రం చాలా కష్టం. కథ దగ్గర నుంచి అభిమానుల వరకూ చాలా అంశాలు ముడిపడి ఉంటాయి. కానీ బాబీ చాలా సాఫ్ట్ గా ఆలోచించి గ్రామీణ వాతావరణంలో ఇద్దరు మామా అల్లుళ్ల మధ్య సరదాలను పండించే సబ్జెక్ట్ ను ఎంచుకున్నాడు. యాక్షన్ సన్నివేశాలతో పాటు కామెడీ కూడా ఉంటుందంటున్నాడు. నిజానికి ఇలాంటి ప్రయోగం బాబీ తన జై లవకుశ సినిమాలో చేశాడు. ఎన్టీఆర్ ను మూడు డిఫరెంట్ క్యారెక్టర్లలో చూపించి శెభాష్ అనిపించుకున్నాడు. ఇప్పుడు ఈ సినిమా తీసాడు. ఇలాంటి రేర్ ఫీట్లను తెలుగులో ఈ జనరేషన్ లో సాధ్యం చేసింది బాబీ అనే చెప్పాలి.

 

 

ఆయన సినీ ప్రయాణం రవితేజ పవర్ తో మొదలైంది. యాక్షన్, భావోద్వేగాలను బాగా తీస్తాడని పేరొచ్చింది. వెంటనే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ను డైరక్ట్ చేసే అవకాశాన్నీ దక్కించుకున్నాడు. సర్దార్ గబ్బర్ సింగ్ ఫ్లాప్ అయినా ఎన్టీఆర్ అవకాశమిచ్చాడంటే బాబీలో టాలెంట్ ఉండబట్టే. జై లవకుశను హిట్ చేసిన బాబీ మరి వెంకీమామను ఏం చేస్తాడో చూడాల్సిందే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: