దక్షిణాది నుండి ప్యాన్ ఇండియా చిత్రాలు పెరిగిపోతున్నాయి. బాహుబలి తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒక్క తెలుగు సినిమానే కాదు మొత్తం ఇండియన్ సినిమానే సమూలంగా మార్చివేసిన చిత్రం బాహుబలి. కథని సరిగ్గా చెప్పగలిగితే ఏ భాషా చిత్రమైనా ప్రేక్షకులు ఆహ్వానిస్తారని నిరూపించిన చిత్రం బాహుబలి. బాహుబలి స్ఫూర్తితోనే చాలా సినిమాలని వివిధ భాషల్లో విడుదల చేస్తున్నారు.

 

అలా దక్షిణాది నుండి విడుదలైన ఒక చిత్రం అనుకోని విజయం సాధించింది. ఆ చిత్రమే "కేజీఎఫ్". అసలెలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రమ్ సినిమా ప్రేక్షకులని ఎంతగానో అలరించింది. 2018 చివర్లో వచ్చిన ఒక చిత్రం చరిత్ర సృష్టించింది . ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి ప్రభంజనంగా మారింది. కన్నడ భాషలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు, తమిళ మళయాల, హిందీ భాషల్లో అనువాదమై అక్కడి ప్రజల్ని ఎంతగానో ఆకర్షించింది.

 

మొదట్లో ఈ చిత్రంపై ప్రేక్షకులలో కనీస ఆసక్తి లేదు. సినిమా ట్రైలర్ విడుదలయ్యాక కూడా ఎక్కువగా పట్టించుకున్నది లేదు. అదీ గాక హీరో యష్ కూడా అసలు పరిచయం మరియు ఫేమ్ లేని హీరో. కన్నడ ఇండస్ట్రీలో తప్ప అతని గురించి బయట తెలిసింది చాలా తక్కువ. అలాంటి హీరోతో ఇంత పెద్ద సినిమా ఎందుకు చేస్తున్నారనే అందరూ ఆలోచించారు. కానీ సినిమా విడుదల అయ్యాక సీన్ మొత్తం రివర్స్ అయింది. 

 

సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకొని బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ప్రస్తుతం కేజీఎఫ్ ౨ చిత్రీకరణ జరుపుకుంటుంది. అయితే ప్రస్తుతం కేజీఎఫ్ మరీ రికార్డును సొంతం చేసుకుంది.  2019 సంవత్సరానికి గాను అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన చిత్రాలలో అన్ని భాషలలో అత్యధికంగా వీక్షించిన సినిమాగా కేజిఎఫ్ నిలిచింది. కేజిఎఫ్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు అమెజాన్ ప్రైమ్ దక్కించుకోగా అత్యధికంగా వ్యూస్ సాధించి సంస్థకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: