బన్నీత్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూడవ చిత్రం "అల వైకుంఠపురములో". వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన రెండు చిత్రాలు ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకున్నాయి. అందువల్ల ఇప్పుడు ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా తర్వాత బన్నీ నుండి వస్తున్న చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమా నుండి రిలీజైన రెండు పాటలు సినిమాకి ఎంతో హైప్ ని తీసుకొచ్చాయి.

 

యూట్యూబ్ లో ఈ రెండు పాటలు సెన్సేషన్ క్రియేట్ చేశాయి. జనవరి ౧౨ వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే థియేట్రికల్ రిలీజ్ తర్వాత డిజిటల్ రిలీజ్ ఉంటుందని అందరికీ తెలిసిందే. డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ వచ్చాక సినిమా బిజినెస్ జోరందుకుంది. పెద్ద సినిమాలకి అత్యధిక డబ్బులు చెల్లించి డిజిటల్ రైట్స్ ని కొనుక్కుంటున్నాయి. అయితే అల వైకుంఠపురములో డిజిటల్ రైట్స్ అమ్ముడయ్యాయనే వార్త జోరందుకుంది.

 

ప్రఖ్యాత డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ అలవైకుంఠపురంలో డిజిటల్ రైట్స్ భారీ ధర చెల్లించి దక్కించుకుందట. దీనికి సంబంధించి డీల్ కూడా పూర్తయిందని తెలుస్తుంది. దీనిపై చిత్ర యూనిట్ ఎటువంటి అధికారిక ప్రకటన చేయకున్నప్పటికీ విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తున్న వార్త. ఈ వార్త నిజమైతే డిజిటల్ హక్కులు ఎంతకి పలికాయనే విషయం తెలియాలి. ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలు క్రియేట్ చేసిన కాబట్టి మంచి ధరకే అమ్ముడయ్యుంటాయి.

 

అల వైకుంఠపురంలో చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తుండగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. టబు, సుశాంత్, నివేదా పేతురాజ్ ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు. బన్నీ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ మూడవ చిత్రం కూడా మంచి విజయం సాధించాలని కోరుకుందాం.

మరింత సమాచారం తెలుసుకోండి: