ఈ మాటలు అంటుంది ఎవరో కాదు.. మెగా బ్రదర్ నాగబాబు.  మెగాస్టార్ తమ్ముడిగా సినీమాల్లోకి వచ్చిన ఆయన నటుడిగా కొనసాగుతూనే నిర్మాతగా మారారు. కొంత కాలంగా జబర్ధస్త్ కామెడీ షో లో జడ్జీగా వ్యవహరిస్తూ వచ్చారు.   ఈ మద్య జబర్ధస్త్ కి గుడ్ బాయ్ చెప్పిన విషయం తెలిసిందే.  తాజాగా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచార కేసు జనసేన, వైసీపీల మధ్య మాటల యుద్ధానికి కారణమైంది. ‘రేపిస్టులకు ఉరిశిక్ష వద్దు బెత్తం దెబ్బలు చాలు’ అని పవన్ కళ్యాణ్ అన్నట్టు ఒక దినపత్రికలో ప్రచురితమైంది. తాజాగా దీనిపై నాగబాబు తీవ్ర స్థాయిలో స్పందించారు. కొన్ని రాజకీయ పార్టీలకు కొమ్ముకాసే పత్రికలు, కొంత మంది రాజకీయ నాయకులు, పూర్తిగా అర్థంకానటువంటి కొంత మంది కోనా మేధావులు గత రెండు రోజులుగా కళ్యాణ్ బాబు విషయంలో తప్పుగా, అడ్డగోలుగా మాట్లాడుతున్నారు.  

 

దిశ కేసు విషయంలో తమ్ముడుపై వస్తున్న నిందారోపణలు తట్టుకోలేక...వారి తల్లిదండ్రులు ఆవేదన చెందకూడదని మాట్లాడుతున్నా అన్నారు. కళ్యాణ్ బాబు ఏమన్నాడు.. మీరు ఏం చెప్తున్నారు.. అనే విషయంలో నేను క్లారిటీ ఇవ్వాలి.  ఒక వీడియో క్లిప్‌ని ఎడిట్ చేసి వాళ్లకు కావాల్సిన రీతిలో పెట్టుకున్నవాళ్లు ఒకరు. ఇక దిశ రేప్ కేసు నిందితుల గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడు తాను ప్రత్యక్షంగా అక్కడ ఉన్నానని నాగబాబు చెప్పారు. ఒక ఆడపిల్ల ఉదయం బయటకు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చే లోపల ఆమెకు చిన్నపాటి అసౌకర్యం కలిగించినా, ఈవ్ టీజింగ్, లైంగిక వేధింపులు వంటి తప్పులు చేసినా సరే సింగపూర్ తరహాలో బెత్తం దెబ్బలు (కేనింగ్) కరెక్ట్‌గా కొడితే.. మగపిల్లలు మరోసారి అలాంటి దారుణాలకు పాల్పపడరని అన్నారు.

 

చంపేయమని అందరూ చెబుతారు.. ఈ ప్రభుత్వాలు ఉన్నది దేనికి? కఠిన చట్టాలు తీసుకు వస్తే ఇలాంటి దారుణాలు ఎందుకు జరుగుతాయని అన్నారు. దున్నపోతు ఈనింది అంటే దూడను కట్టేయండి అనే బాపతు ఆలోచనలు పక్కనపెట్టండి.  మీలా మేమూ మాట్లాడగలం.. కానీ సంస్కారం అనేదానికి కట్టుబడి పోతున్నామని అన్నారు నాగబాబు.   

మరింత సమాచారం తెలుసుకోండి: