బాలక్రిష్ణ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం కే ఎస్ రవికుమార్ దర్శకత్వంలో "రూలర్" అనే మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా డిసెంబర్ ఇరవయవ తేదీన విడుదలకి సిద్ధంగా ఉంది. అయితే ఈ సినిమా తర్వాత బాలయ్య బోయపాటి తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా లాంచన కార్యక్రమం నిన్న జరిగింది. బాలయ్య 106 వ చిత్రంగా తెరకెక్కబోతున్న ఈ చిత్రానికి ఇంకా టైటిల్ నిర్ణయించలేదు.

 

నిజానికి బోయపాటి సినిమా ముందే పట్టాలెక్కాల్సి ఉంది. కానీ బాలయ్య కే ఎస్ రవికుమార్ కి కమిట్ అవ్వడంతో ఇంత ఆలస్యం అయ్యింది. అయితే బోయపాటి బాలయ్యతో తీసే సినిమాలో హీరోయిన్ కోసం వెతుకుతున్నారట. మహానటి ద్వారా ఎనలేని కీర్తి సంపాదించిన కీర్తి సురేష్ కి బోయపాటి కథ వినిపించాడట. అయితే కీర్తి నుండి ఇంతవరకు ఎలాంటి సందేశం రాలేదట. కీర్తి ఒప్పుకుంటే ఈ సినిమా షూటింగ్ తొందరగా స్టార్త్ అవుతుందట.

 

లేదంటే మళ్ళి మరో హీరోయిన్ కోసం వెతకాల్సి వస్తుంది. ప్రస్తుతానికి వెటరన్ హీరోలతో సినిమాలు చేయడానికి హీరోయిన్లు ఆసక్తి చూపించడం లేదట. వెటరన్ హీరోలతో నటిస్తే యంగ్ హీరోల సినిమాల్లో అవకాశాలు తగ్గిపోతున్నాయట. అందువల్ల హీరోయిన్లు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారట. మరి కీర్తి సురేష్ ఈ విషయంలో ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. తమిళంలో కీర్తి సురేష్ సీనియర్ హీరొలతో చేసింది కావున అవేమీ పట్టించుకోకుండా కథ నచ్చి సినిమా ఓకే చేస్తుందా లేదా కెరీర్ కి ఏదైనా ప్రాబ్లెమ్ వస్తుందేమోనని ఆగిపోతుందా అన్నది చూడాలి.

 

బోయపాటి బాలయ్య కాంబినేషన్ లో వస్తున్న మూడవ చిత్రం. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సింహా, లెజెండ్ చిత్రాలు ఎంతటి ఘన విజయం సాధించాయో అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ని విలన్ గా నటింపచేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: