ఒకటి కాదు.. రెండు కాదు.. ఆరేళ్లలో తెలంగాణలో లా అండ్ ఆర్డర్ అంటే ఇది అనేలా ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న సంచలన నిర్ణయాలు అన్నీ ఇన్నీ కావు.  నాడు గ్యాంగ్ స్టర్ నయీం అందరినీ బెదిరించేవాడు.. ఒకదశలో పోలీస్ వ్యవస్థ, రాజకీయ వ్యవస్థను సైతం తన గుప్పిట్లో పెట్టుకున్నట్లు వార్తలు వచ్చేవి.  అప్పటి ప్రభుత్వాలకు, మంత్రులకూ నయీం అంటే భయమే...  కానీ కేసీఆర్ సీఎం అయ్యాక ఏం జరిగిందో అందరికీ తెలుసు.  అలాంటి సంచలన నిర్ణయాలు ఎన్నో ఆయన తీసుకుంటూ వస్తున్నారు.  తాజాగా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వెటర్నరీ డాక్టర్ దిశ అత్యాచార, హత్యోదంతంపై ఎన్నో నిరసనలు, ఆ రాక్షసులను పబ్లిక్ గా చంపేయాలని, ఉరి తీయాలని ఆందోళనలు జరిగాయి.  పార్లమెంట్ లో సైతం దిశ పై జరిగిన అన్యాయాన్ని ఖండిస్తూ నేతలు తమ గళం విప్పారు.

 

 అయితే కొంత మంది తెలంగాణ ప్రభుత్వం దిశ కేసు నీరుగారుస్తుందని.. కోర్టు, జైలు అంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని నిరసనలు వెల్లువెత్తాయి.  ప్రతిపక్ష నేతలు ఇది పెద్ద నేరంగా పరిగణించారు.  కానీ ఎవ్వరూ ఊహించని సంఘటన నిన్న జరిగింది.  దిశ కేసులో నింధితులైన నలుగురు దుర్మార్గులను ఎన్ కౌంటర్ చేశారు.  పోలీసులపై తిరగబడి  రాళ్లు రువ్వడం, గన్స్ లాగేసుకొని ఫైర్ చేయడంతో వారిని ఎన్ కౌంటర్ చేసినట్లు సీపీ సజ్జనార్ తెలిపారు.  సంఘటన జరిగిన గంటలోపై యావత్ ప్రపంచానికి ఈ వార్త చేరింది. దిశ ఘటనలో నిందితుల ఎన్ కౌంటర్ పై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

 

ఈ ఘటనపై రాజకీయనాయకులు, సినీ తారలు, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు, దిశ కుటుంబసభ్యులు, మహిళా సంఘాలు తదితరులు తెలంగాణ ప్రభుత్వం, పోలీస్ వ్యవస్థపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా నటుడు, దర్శకుడు పోసాని కృష్ణ మురళి  ఈ విషయంపై స్పందిస్తూ.. గతంలో కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు గ్యాంగ్ స్టర్ నయీం తిరిగేవాడని,  కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇలాంటి వ్యక్తి ప్రజల మధ్య ఉండకూడదని ఏం చేశారో తెలిసిందే. కేసీఆర్ నలభై కిలోల డైనమైట్ అని ప్రశంసించారు.  తెలంగాణ ప్రజానీకం మొత్తానికి, ఓటున్న ప్రతి ఒక్కరికీ చెబుతున్నా ‘కేసీఆర్ చనిపోయే వరకూ కేసీఆర్ నే ముఖ్యమంత్రిగా ఉంచండి. ఇండియాలో తెలంగాణ బెస్ట్ స్టేట్ అవుతుంది’ అని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: