టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాఘవేంద్ర దర్శకత్వంలో ఎంట్రీ ఇచ్చిన తాప్సీ అతి తక్కువ కాలంలోనే ఓ రేంజ్ లో తనకంటూ సెపరేట్ క్రేజ్ మరియు అదే విధంగా మార్కెట్ క్రియేట్ చేసుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ ప్రాజెక్టులతో బిజీ హీరోయిన్ గా వరుస ఆఫర్లు దక్కించుకుంటూ బిజీ బిజీగా గడుపుతున్న హీరోయిన్ తాప్సీ అనేక సందర్భాలలో సోషల్ మీడియాలో తన కెరీర్ గురించి మరియు ఇంకా అనేక విషయాల గురించి ఎప్పటికప్పుడు అభిమానులకు ఎలాంటి మొహమాటం లేకుండా ముక్కుసూటి సమాధానాలతో తనదైన శైలిలో చెబుతూ వస్తుంటుంది. ఈ విధంగానే ఇంటర్వ్యూలో కూడా నిర్మొహమాటం లేకుండా తన అభిప్రాయాలను వెల్ల పుచ్చుతుంది తాప్సీ.

 

ఇటువంటి నేపథ్యంలో తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇండియా టుడే కాంక్లేవ్ నిర్వహించిన ఒక చర్చ కార్యక్రమంలో తాప్సి తనకు ఎదురైన కొన్ని ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలను ఇచ్చి అంతటా హాట్ టాపిక్ గా మారింది. తాప్సీకి ఈ విధమైన ప్రశ్న ఎదురయింది. మీకు ఎలాంటి సెక్స్ అంటే ఇష్టపడతారు… అంతేకాకుండా సెక్స్ సరిగ్గా చేయకపోయినా బాగా ప్రేమించే వ్యక్తిని ఇష్టపడతారా..? లేకపోతే మిమ్మల్ని ఇష్టపడకపోయినా గాని సెక్స్ బాగా చేస్తే నీకు ఇష్టమేనా అంటూ ప్రశ్నించారు.

 

దీంతో తనకు ఎదురైన ప్రశ్నకు తాప్సీ అదిరిపోయే రీతిలో సమాధానం చెప్పింది. ఆ ప్రశ్నకు తాప్సీ ఇచ్చిన ఆన్సర్ ఏమిటంటే..సెక్స్.. ప్రేమ ఎప్పుడు వేరు వేరుగా ఉండవని, వాటిని వేరు వేరుగా చూడలేమని చెప్పుకొచ్చి ఆశ్చర్యపరిచింది. దీంతో తాప్సీ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదే కార్యక్రమంలో తన ఫ్యూచర్ ప్రాజెక్ట్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల గురించి అనేక విషయాలు మీడియా సముఖంగా పంచుకుంది. భారత అగ్రశ్రేణి మహిళా క్రికెటర్‌ మిథాలీ రాజ్‌ జీవితం ఆధారంగా ‘శభాష్‌ మిత్తు’ సినిమా గురించి అనేక విషయాలు తెలియజేసింది. ఈ సినిమాలో తాప్పి మిథాలీగా నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: