బాలీవుడ్ స్టార్ యాక్టర్ కార్తిక్ ఆర్యాన్ యాక్టింగ్ కోసం సెక్స్ ను వదులుకోలేనని ఓపెన్ గా చెప్పేసాడు. ఒక టాక్ షోలో పాల్గొన్న కార్తీక్ జీవితంలో తను ఏ విషయాలను తేలికగా వదిలేస్తారు, ఏ విషయాలను వదులుకోవడం కష్టంగా ఉంటుందో అడిగారు, యాక్టింగ్ ఇష్టమా సెక్స్ ఇష్టమా అని షో నిర్వాహుకులు అడుగగా నేను యాక్టింగ్ కోసం సెక్స్ ను వదిలెయ్యలేను అని చెప్పారు. 

 

కార్తీక్ ఆర్యన్ ఇలా అన్నారు: "యాక్టింగ్ మరియు సెక్స్ నాకు బ్రేడ్, బట్టర్ లాంటివి. రెండిటిలో దేన్ని వదులుకోవడం నాకు ఇష్టం లేదు. యాక్టింగ్ మరియు సెక్స్ నాకు రెండూ ముఖ్యమే అని" పేర్కొన్నారు. "నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడటం నాకు ఇష్టం లేదు, కానీ అదే సమయంలో దాన్ని దాచడం కూడా నాకు ఇష్టం లేదు. అక్కడ ఎవరో ఉన్నారని నాకు నచ్చిన వారితో రెస్టారెంట్‌కు వెళ్లకుండా ఉండలేను." అని చెప్పరు.

 

కార్తీక్ మాత్రమే కాకుండా, భూమి పడ్నేకర్ మరియు అనన్య పాండే కూడా వారి వారి వ్యక్తిగత జీవితాల గురించి ఈ షో లో మాట్లాడారు. అనన్య మాట్లాడుతూ ఒకరితో గతంలో డేటింగ్ లో ఉన్నాను అని చెప్పింది అయితే ఇప్పుడు మాత్రం బ్రేకప్ అయిందని చెప్పింది. జీవితంలో బ్రేకప్ అయితే ఎలా ఎదుర్కోవాలో యువతకు సలహా కూడా ఇచ్చింది ఈ అమ్మడు. 

 

కార్తీక్ ఆర్యన్, భూమి పడ్నేకర్ మరియు అనన్య పాండే నటించిన పాటి పట్ని ఔర్ వో యొక్క ట్రైలర్ మిశ్రమ స్పందన పొందింది. ఈ మధ్యే ఈ ట్రైలర్ విడుదల కాగా సోషల్ మీడియా ఊహించినంత రెస్పాన్స్ మాత్రం అందుకోలేదు. 

కొంతమంది ఈ ట్రైలర్ ను ఇష్టపడగా, కొందరు మాత్రం వైవాహిక జీవితం మీద కామెంట్స్ చేసారంటూ ఆరోపించారు ఈ నేపథ్యంలో మూవీ నిర్మాతలు క్షమాపణలు చెప్పి మూవీ లో నుంచి ఆ సీన్ ను తొలగించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: