విక్టరీ వెంకటేష్ మరియు అక్కినేని నాగచైతన్య హీరోలుగా సురేష్ ప్రొడక్షన్స్ మరియు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారి సంయుక్త నిర్మాణంలో తెరకెక్కుతున్న తాజా సినిమా వెంకీ మామ. తొలి సారిగా వెంకీ, చైతు కలిసి నటిస్తున్న సినిమా కావడంతో అటు అక్కినేని ఫ్యాన్స్ తో పాటు, ఇటు దగ్గుబాటి ఫ్యాన్స్ లో కూడా ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. 

 

ఇద్దరు మామ అల్లుళ్ళ మధ్య ప్రేమానురాగాలు, మరియు భావోద్వేగాలతో కూడిన ఒక మంచి కథతో ఈ సినిమా తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు ఖమ్మంలో ఎంతో వైభవంగా జరుగనుంది. సినిమా యూనిట్ సభ్యులతో పాటు పలువురు సినిమా ప్రముఖులు పాల్గొననున్న ఈ వేడుకకు భారీగా ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు నేడు జరిగాయి. కాగా ఈ సినిమాకు యు/ఏ సర్టిఫికెట్ లభించడంతో సినిమా యూనిట్ కొంత షాక్ కు గురైనట్లు సమాచారం. ఇటీవల జరిగిన ఈ సినిమా ప్రెస్ మీట్ లో భాగంగా దర్శకుడు బాబీ మాట్లాడుతూ, 

 

సినిమా ఫస్ట్ హాఫ్ అంతా మంచి ఎంటర్టైన్మెంట్ తో సాగుతుందని, అలానే సెకండ్ హాఫ్ లో కూడా ఎంటర్టైన్మెంట్ ఉన్నప్పటికీ, కొంత సెంటిమెంట్ మరియు ఎమోషనల్ గా సినిమా సాగనున్నట్లు చెప్పారు. అయితే మొత్తంగా సినిమాకు తాము క్లీన్ యు సర్టిఫికెట్ వస్తుందని భావిస్తే యు/ఏ సర్టిఫికెట్ రావడంతో సినిమా టీమ్ కొంత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి సినిమాలో యక్ష పార్ట్ ఎక్కువ ఉండడం వల్లనా, లేక హాట్ భామ పాయల్ అందాల ఆరబోత ఎక్కువ అవ్వడం వల్ల యు/ఏ సర్టిఫికెట్ ఇచ్చారా అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే. కాగా ఈ సినిమాను ఈనెల 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. వెంకీ కి జోడిగా రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్, చైతు కు జోడిగా రాశి ఖన్నా నటిస్తున్న ఈ సినిమాకు ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని అందించాడు......!!

మరింత సమాచారం తెలుసుకోండి: