నందమూరి బాలకృష్ణ హీరోగా కె.ఎస్ రవికుమార్ డైరక్షన్ లో వస్తున్నా సినిమా రూలర్. సి.కె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సి కళ్యాన్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఆల్రెడీ రవికుమార్ తో జై సింహా సినిమా చేసిన బాలయ్య బాబు మరోసారి ఈ డైరక్టర్ తో రూలర్ సినిమా చేయడం విశేషం. డిసెంబర్ 20న రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో బాలకృష్ణ సరసన సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్స్ గా నటించారు. 

 

ఈమధ్యనే సినిమా నుండి మొదటి సాంగ్ రిలీజ్ అవగా సాంగ్ నందమూరి ఫ్యాన్స్ ను విశేషంగా ఆకట్టుకుంది. అంతేకాదు సినిమాలో బాలకృష్ణ లుక్స్ చాలా కొత్తగా ఉన్నాయి. 60  ఏళ్ళు దగ్గరపడుతున్నా సరే బాలయ్యలో జోష్ ఏమాత్రం తగ్గలేదని చెప్పొచ్చు. ప్రత్యేకంగా రూలర్ సినిమాలో బాలయ్య స్టైలిష్ లుక్స్ ఫ్యాన్స్ ను విశేషంగా అలరిస్తున్నాయి. 

 

ఒక పక్క మోడరన్ లుక్ తో పాటుగా మరో పక్క పవర్ ఫుల్ పోలీస్ గా కనిపించనున్నాడు బాలయ్య బాబు. తప్పకుండా ఈ సినిమా నందమూరి ఫ్యాన్స్ కు న్యూ ఇయర్ ఫెస్టివల్ ముందే తెచ్చేలా ఉందని చెప్పొచ్చు. ఈమధ్యనే రిలీజైన టీజర్ కూడా సినిమాపై అంచనాలు పెంచింది. కథ రెగ్యులర్ గా అనిపించినా టీజర్ లో అసలు ఏమి రివీల్ చేయలేదని తెలుస్తుంది. అసలు కథ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే అంటూ చిత్రయూనిట్ చెబుతున్నారు.

 

100 సినిమాలు పూర్తి చేసుకున్న బాలకృష్ణ ఈమధ్య సినిమాల విషయంలో స్పీడ్ పెంచారని చెప్పొచ్చు. రూలర్ సినిమా రిలీజ్ అవుతుందో లేదో బోయపాటి శ్రీను సినిమా ముహూర్తం పెట్టేశాడు. రూలర్ సినిమాలో బాలయ్య లుక్స్ చూసిన యువ హీరోలు షాక్ అవుతున్నారు. ఈ వయసులో బాలయ్య చేస్తున్న ఈ ప్రయత్నాన్ని మెచ్చుకుని తీరాల్సిందే. మరి ప్రేక్షకుల మెప్పు కూడా ఉంటుందో లేదో తెలియాలంటే డిసెంబర్ 20 వరకు వెయిట్ చేయాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: