డైరెక్టర్ కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన ‘రూలర్’ సినిమా డిసెంబర్ నెల 20వ తారీఖున విడుదల కాబోతున్న క్రమంలో సినిమాపై అనేక అంచనాలు పెట్టుకున్నారు బాలయ్య బాబు అభిమానులు. ముఖ్యంగా బాలయ్య బాబు నటించిన గత రెండు సినిమాలు అనగా ఎన్టీఆర్ బయోపిక్ కి సంబంధించి రెండు సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడటంతో ‘రూలర్’ సినిమాతో అయినా బాలకృష్ణ హిట్ కొడతాడు అని చాలా ఆశలు పెట్టుకున్నారు నందమూరి అభిమానులు. ఇదే తరుణంలో బాలయ్యబాబు కూడా ‘రూలర్’ సినిమాతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కటానికి అన్ని విధాల సినిమా కోసం షూటింగ్ సమయంలో బాగా కష్టపడినట్లు ఫిలింనగర్లో వార్తలు వినబడుతున్నాయి.

 

దాదాపు ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తి కావడంతో ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో సినిమా యూనిట్ చాలా బిజీ బిజీగా గడుపుతోంది. మరోపక్క ఈ సినిమాకి సంబంధించి బాలయ్య లుక్స్, పోస్టర్లు, టీజర్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.. ఇక, ఈ మూవీ ట్రైలర్ రిలీజ్‌కు కూడా ముహూర్తం పెట్టేశారు మేకర్స్.. ఈ నెల 8వ తేదీన ఉదయం 8.19 గంటలకు ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అయితే రేపు విడుదల కాబోయే ట్రైలర్లో బాలయ్య బాబు అభిమానులను మెస్మరైజింగ్ చేసే విధంగా ట్రైలర్ లో సరికొత్తగా గతంలో ఎన్నడూ చూడని విధంగా కె.ఎస్.రవికుమార్ ట్రైలర్ రూపొందించినట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు గట్టిగా వినబడుతున్నాయి.

 

కచ్చితంగా ట్రైలర్ బాలయ్య బాబు అభిమానులను బాగా ఆకట్టుకుంటుందని సినిమా యూనిట్ అంటుంది. ఈ సినిమాలో బాల‌య్య సరసన వేదిక‌, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. భూమికా చావ్లా, జ‌య‌సుధ‌, ప్రకాష్ రాజ్ తదితరలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. హ్యాపీ మూవీస్ ప‌తాకంపై నిర్మాత సి.క‌ళ్యాణ్ ఈ సినిమాను నిర్మిస్తుండగా.. చిరంత‌న్ భ‌ట్ సంగీతం అందిస్తున్నాడు. ఈనెల 20వ తారీఖున ఈ సినిమా విడుదల కానుంది. బాలయ్య బాబు సినిమాలో రెండు డిఫరెంట్ పాత్రలో నటిస్తున్నట్లు సినిమాకి సంబంధించి విడుదలైన ఫోటోలు బట్టి మరియు టీజర్ బట్టి తెలుస్తోంది.  

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: