యువరత్న నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రస్తతం కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూలర్ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. గత ఏడాది కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో వచ్చిన జైసింహా మంచి సక్సెస్ కావడంతో బాలకృష్ణ మరొక్కసారి ఆయనకే అవకాశం ఇవ్వడం జరిగింది. ఇక బాలకృష్ణ ఎన్నో ఆశలు పెట్టుకుని ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలైన కథానాయకుడు, 

 

మహానాయకుడు రెండూ కూడా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలం అవడంతో, ఎలాగైనా రూలర్ తో హిట్ కొట్టాలని గట్టిగా పట్టుదలతో ఈ సినిమా కోసం శ్రమిస్తున్నట్లు తెలుస్తోంది. మాస్ పోలీస్ ఆఫీసర్ గా, అలానే ఒక పెద్ద కంపెనీ సీఈవో గా రెండు రకాల షేడ్స్ ఉన్న పాత్రల్లో బాలకృష్ణ ఈ సినిమాలో కనపడనున్నట్లు టాక్. మంచి మాస్ అంశాలతో పాటు, పలు ఎంటర్టైన్మెంట్ మరియు యాక్షన్ సీన్స్ కలబోతగా ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. యువ అందాల భామలు సోనాల్ చౌహన్, వేదిక హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో భూమిక ఒక ముఖ్య పాత్రలో నటిస్తుండగా చిరంతన్ భట్ సంగీతాన్ని అందిస్తున్నారు. 

 

ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ఇటీవల యూట్యూబ్ లో రిలీజ్ అయి నందమూరి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి మంచి స్పందనను రాబట్టడం జరిగింది. రేపు ఉదయం 8 గంటల 19 నిమిషాలకు ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ కూడా రిలీజ్ కానుంది. మరికొద్ది రోజుల్లో ప్రీ రిలీజ్ వేడుక జరుపుకోనున్న ఈ సినిమా, తప్పకుండా మంచి సక్సెస్ సాధించడంతో పాటు బాలకృష్ణ గారు ఈ సారి రూలర్ గా బాక్సాఫీస్ ని రూల్ చేయడం ఖాయం అని సినిమా యూనిట్ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి వరుసగా రెండు ఫ్లాప్స్ తో సతమతం అవుతున్న బాలకృష్ణకు ఈ సినిమా ఎంతవరకు సక్సెస్ ని అందిస్తుందో చూడాలి.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: