ఈమధ్య కాలంలో పవన్ కళ్యాణ్ చేస్తున్న కామెంట్స్ అతడు భారతీయ జనతా పార్టీకి దగ్గర అవుతున్నాడు అన్న స్పష్టమైన క్లారిటీ ఇస్తున్నాయి. దీనికితోడు పవన్ ఈమధ్య మీడియాతో మాట్లాడుతూ తాను ఎప్పుడు భారతీయ జనతా పార్టీకి దూరం అయ్యాను  అంటూ ఓపెన్ గా చెప్పడంతో ప్రస్తుతం పవన్ అనుసరిస్తున్న రాజకీయ ఊహాలు అన్నీ బిజెపి డైరెక్షన్ లో జరుగుతున్నాయి అన్న సందేహాలకు తావు ఇస్తోంది.

ఈ పరిస్థితుల నేపధ్యంలో ఈరోజు జరుగుతున్న ‘ఆర్మీ ఫోర్సెస్ ఫ్లాగ్ డే’ సందర్భంగా పవన్ కళ్యాణ్ కేంద్రీయ సైనిక బోర్డ్ నిధికి కోటి రూపాయల విరాళం ఇవ్వడం సంచలనంగా మారింది. దీనితో పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ మెప్పుకోసం ఇలాంటి విరాళాలు ఇస్తున్నాడు అంటూ విమర్శలు మొదలయ్యాయి. 

ఈ విమర్శలు పవన్ దృష్టి వరకు వెళ్ళడంతో తన పై విమర్శలు చేస్తున్న వారికి పవన్ ధీటైన సమాదాహనం ఇచ్చాడు. 1999 సంవత్సరంలో కేంద్రీయ సైనిక బోర్డ్ నిధికి పవన్ కళ్యాణ్ తన తండ్రి వెంకట్రావ్ చేతుల మీదుగా లక్ష రూపాయలు విరాళం ఇచ్చిన విషయానికి సంబంధించిన న్యూస్ పేపర్ క్లిపింగ్ ను షేర్ చేస్తూ ‘జైహింద్’ అంటూ ట్విట్ చేసాడు.

దీనితో తనకు సైనికులు అన్నా దేశభక్తి అన్నా అభిమానం ఈనాటిది కాదనీ తనకు రాజకీయాలకోసం దేశభక్తిని ఆపాదించుకోవలసిన అవసరం లేదు అంటూ పరోక్షంగా సంకేతాలు పవన్ ఇస్తున్నాడు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలలో నటించడం లేదు. అయితే అనేకమంది టాప్ హీరోలు ఆర్మీ మేజర్లుగా నటిస్తూ సినిమాలు చేస్తున్న పరిస్థితులలో వారెవ్వరికీ గుర్తుకు రాని ఆర్మీ ఫోర్స్ ఫ్లాగ్ డే కనీసం పవన్ కు అయినా గుర్తుకు వచ్చినందుకు ఆనంద పడాలి. పవన్ ఇచ్చిన విరాళం పై కూడ రాజకీయ రంగులు ఏర్పడేలా కామెంట్స్ రావడం బట్టి నేటి రాజకీయ విలువలు ఎలా ఉన్నాయో అర్ధం అవుతున్నాయి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: