టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరు నందమూరి బాలకృష్ణ.  క్రిష్ దర్శకత్వంలో తన వందవ సినిమా ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ పూర్తి చేశారు.  ఈ సినిమా మంచి సక్సెస్ సాధించడంతో మరోసారి క్రిష్ దర్శకత్వంలో తన తండ్రి సీనియర్ ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా ‘ఎన్టీఆర్ బయోపిక్’ లో నటించారు.  ఈ మూవీ రెండు భాగాలు గా తెరకెక్కించారు.  ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు.. కానీ రెండు మూవీస్ బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడ్డాయి.  ఆ తర్వాత ఏపిలో ఎన్నికలు రావడం.. హిందూపురం నుంచి బాలయ్య ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది.  ప్రస్తుతం కే.యస్.రవికుమార్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ ‘రూలర్’ మూవీలో నటిస్తున్నాడు.  ఈ సినిమా కోసం బాలయ్య పూర్తిగా మేకోవర్ అయి సరికొత్తగా మారిపోయాడు.

 

ఈ సినిమాలో కథ ప్రకారం బాలకృష్ణ పోలీస్ ఆఫీసర్.  గతంలో పోలీస్ ఆఫీసర్ గా నటించి సినిమాలు మంచి సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. ట్విస్ట్ ఏంటేంటే ఈ మూవీలో గొప్ప పోలీస్ ఆఫీసర్ తర్వాత గ్యాంగ్ స్టర్ గా ఎలా మారాడు అనే ఇతివృత్తంతో ఈ మూవీ తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. కాగా, ఇప్పటికే విడుదల చేసిన బాలయ్య లుక్స్‌, టీజర్ కి సోషల్ మీడియాలో మంచి  రెస్పాన్స్ వచ్చింది. టీజర్ లో పూర్తిగా యంగ్ ‌గా మరిపోయిన బాలయ్య లుక్‌ను చూసి అభిమానులు పండగ చేసుకుంటున్నారు.  

 

ఈ సినిమాను డిసెంబర్ 20న క్రిస్మస్ కానుకగా విడుదల చేయనున్నారు. ఈ మూవీలో  బాలకృష్ణ సరసన సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. భూమిక ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. మరి ఈ సినిమాతో బాలయ్య బాక్సాఫీస్ దగ్గర మరోసారి తన సత్తా చూపెడతాడా లేదా అనేది చూడాలి. గతంలో కే.యస్.రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ ‘జై సింహ’ మూవీలో నటించాడు.  ఈ మూవీ లో కూడా బాలయ్యను చాలా డిఫరెంట్ గా చూపించినా పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయింది.  మరి ఈసారి బాలయ్య న్యూ లుక్కు ‘రూలర్’ కి ఎంత వరకు కలిసి వస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: