‘బిగ్ బాస్’  రియాల్టీ షోకి ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ ఉంది. ఇప్పటికే తెలుగులో మరియు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలలో ఆయా భాషలలో ‘బిగ్ బాస్’ రియాల్టీ షో రన్నింగ్ అవుతుంది. అయితే ఈ నార్త్ లో బాలీవుడ్ ఇండస్ట్రీలో ‘బిగ్ బాస్’ సీజన్ 13 ప్రస్తుతం రన్ అవుతుంది. కాగా ఈ రియాల్టీ షో కి యాంకర్ గా కండలవీరుడు సల్మాన్ ఖాన్ రాణిస్తున్న విషయం అందరికీ తెలిసినదే. ప్రస్తుతం జరుగుతున్న సీజన్ 13 బాలీవుడ్ ప్రేక్షకులను మరియు టెలివిజన్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న క్రమంలో షో ఆసక్తికరంగా రన్ అవుతున్న తరుణంలో… హౌస్ లో కంటెస్టెంట్ గా రీ ఎంట్రీ ఇచ్చిన బుల్లితెర నటుడు అర్హాన్ ఖాన్ చేసిన పనికి కొట్టే అంత పని చేసినట్లు హౌస్ లో ఉన్న సల్మాన్ రియాక్ట్ అయ్యారు. విషయంలోకి వెళితే ప్రస్తుతం జరుగుతున్న సీజన్ 13 లో హౌస్ లో  అర్హాన్ ఖాన్, రష్మి దేశాయ్ అనే ఇద్దరు బుల్లితెర నటులు పెద్ద హాట్ టాపిక్ జంట అయ్యారు.

 

వీళ్లిద్దరూ ‘బిగ్ బాస్’ సీజన్ 13లో హౌస్ లో ఒకరంటే ఒకరు పడి చచ్చిపోయేంత గా దగ్గర అయిపోయారు. దీంతో ఒకానొక సమయంలో అర్హాన్ ఖాన్ హౌస్ నుండి ఎలిమినేట్ కావడంతో ఆ సమయంలో రష్మి దేశాయ్ బోరున ఏడ్చేసింది. దీంతో వీరిద్దరి వల్ల ‘బిగ్ బాస్’ సీజన్ 13 రియాల్టీ షో బాగా రక్తి కడుతున్న నేపథ్యంలో ప్రేక్షకులు బాగా ఈ జంట కి కనెక్ట్ కావడం తో అర్హాన్‌ను మళ్లీ షోలోకి తీసుకొచ్చాడు సల్మాన్. దాంతో రష్మి, అర్హాన్ మరింత క్లోజ్ అయిపోయారు. అయితే బిగ్‌బాస్ షోలోనే రష్మిని పెళ్లి చేసుకుంటానని అర్హాన్ ఇటీవల వెల్లడించడం అందరినీ షాక్‌కు గురిచేసింది.

 

దీంతో సీజన్ థర్టీన్ యాంకర్ గా వ్యవహరిస్తున్న కండలవీరుడు సల్మాన్ వారిద్దరి మధ్య బాంబు పేల్చాడు. విషయంలోకి వెళితే  అర్హాన్ ఖాన్ కి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది. దీంతో అతనికి బుద్ధి చెప్పాలని తాజాగా జరిగిన ఎపిసోడ్ లో సల్మాన్ ఖాన్ స్టేజిపైకి కొట్టే అంత కోపంతో వచ్చి...రావటం రావటం స్టేజీపై నుండి హౌస్ లో ఉన్న అర్హాన్‌కు సూటి ప్రశ్న వేశాడు. ‘అర్హాన్ నీకు బయటి ప్రపంచం గురించి మాట్లాడటమంటే చాలా ఇష్టం కదా. ఇప్పుడు నీ ప్రపంచం గురించి మాట్లాడుకుందాం. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు’ అని అడిగాడు. ఇందుకు అర్హాన్ తెగ కంగారుపడిపోతూ.. ‘నేను, అమ్మానాన్న, చెల్లి’ అని సమాధానమిచ్చాడు. అప్పుడు సల్మాన్.. ‘ఇంకెవరు ఉంటారు’ అని కోపంగా అడిగాడు. ఇందుకు అర్హాన్ గుటకలు మింగాడు. దాంతో సల్మాన్‌కు కోపం కట్టలు తెంచుకుంది. తన సూట్ విప్పి నేలకేసి కొట్టాడు. ‘నీ భార్య, బిడ్డ గురించి రష్మికి చెప్పలేదా?’ అని అందరి ముందు నిలదీశాడు. దాంతో బిగ్‌బాస్ హౌజ్‌లోని కంటెస్టెంట్లు షాకయ్యారు. ఈ విషయం తెలీగానే రష్మి షాక్ కి గురి కావడం జరిగింది. అంతే కాకుండా తీవ్ర భావోద్వేగానికి గురి అయ్యి కన్నీటిపర్యంతమై గుండె పగిలి పోయేటట్లు ఏడ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: