సెన్సేషనల్ డైరెక్టర్ కాంట్రవర్సీ లకు కేరాఫ్ అడ్రస్ వివాదాస్పద డైరెక్టర్ రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సినిమా రిలీజ్ అవ్వడానికి లైన్ క్లియర్ అయిపోయింది. ముందుగా ఈ సినిమాని కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే టైటిల్ తో తెరకెక్కించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు బలమైన సామాజిక వర్గాల మధ్య వివాదాలు సృష్టించే విధంగా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ వ్యవహరించారని చాలామంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన పార్టీల రాజకీయ నేతలు మరి అధికారంలో ఉన్న పార్టీ నేతలు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ అనే సినిమా పై తీవ్రస్థాయిలో విరుచుకు పడటం జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 2019 ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాలను బట్టి ఈ సినిమా తెరకెక్కించడం జరిగిందని సినిమా ట్రైలర్ మరియు ఫోటోలు చూస్తే ఆ రకంగానే సినిమా తెరకెక్కించడం జరిగింది అన్నట్టుగా చాలామంది సినిమా పై కామెంట్ చేయడం జరిగింది.

 

ఇలాంటి సినిమాలు తీయడం వల్ల సమాజంలో గొడవలు తప్ప పెద్దగా ఒరిగేదేమీ లేదని చాలామంది రామ్ గోపాల్ వర్మ తీరుపై మండిపడ్డారు. ఇదిలా ఉండగా మొట్టమొదటిసారి ఈ సినిమా సెన్సార్ బోర్డు కి వెళ్లిన సందర్భంలో చాలా మంది అభ్యంతరాలు తెలపడంతో సినిమాలో చాలా కోతలు సెన్సార్ బోర్డ్ సూచించడంతో తీవ్ర అసహనానికి గురైన రామ్ గోపాల్ వర్మ తర్వాత ఎలాగో అలాగా సినిమా ఆన్లైన్ లో విడుదల చేయాలని అప్పట్లో అనుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా మాత్రం ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సినిమా డిసెంబర్ 12 న విడుదల చేయటానికి సెన్సార్ బోర్డు u/a సర్టిఫికేట్‌ను జారీ చేసినట్లు సమాచారం.

 

దీంతో సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వటంతో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ట్విటర్ వేదికగా స్పందించారు. ‘దేశంలో భావ ప్రకటనా స్వేచ్ఛ ఇంకా బతికే ఉందని తెలిసి థ్రిల్ అయ్యాను. ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాకు సెన్సార్ లైన్ క్లియర్. డిసెంబర్ 12న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. సారీ సారీ.. అలవాటులో పొరపాటు. ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సినిమాను డిసెంబర్ 12న విడుదల చేయనున్నాం’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. మొత్తం మీద అనేక రాజకీయ నాటకీయ పరిణామాల మధ్య ఎట్టకేలకు డిసెంబర్ 12వ తారీకున సినిమా విడుదల అవుతున్న తరుణంలో చాలా మంది సినిమా చూడటానికి తెలుగు సినిమా ప్రేక్షకులు ఎంతో ఆసక్తికరంగా ఉన్నట్లు సమాచారం. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: