టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం తన నిర్మాణంలో తెరకెక్కిస్తున్న సినిమా 'అమ్మరాజ్యంలో కడపబిడ్డలు'. ముందుగా ఈ సినిమాకు కమ్మరాజ్యంలో కడపరెడ్లు అనే టైటిల్ ని పెట్టడంతో పలువురు ఆ టైటిల్ పై అభ్యంతరం తెలుపుతూ టైటిల్ కొంత వివాదాస్పదంగా ఉందని, కావున దానిని మార్చాలని కోరుతూ సెన్సార్ బోర్డు కు ఫిర్యాదు చేసారు. అయితే వారి ఫిర్యాదును స్వీకరించిన సెన్సార్ బోర్డు, ఆ సినిమా యూనిట్ ని టైటిల్ మార్చాల్సిందే అంటూ ఒక ఆర్డర్ జారీ చేసింది. 

 

దానితో సినిమా టైటిల్ ని అమ్మరాజ్యంలో కడపబిడ్డలు అని మార్చారు వర్మ. అయితే ఈ సినిమాకు అడ్డంకులు అక్కడితో ఆగిపోలేదు, ఈ సినిమా  ద్వారా వర్మ తనను టార్గెట్ చేస్తున్నారు అంటూ మత ప్రబోధకుడు కేఏ పాల్ ఈ సినిమాను ఆపివేయవలసిందిగా కోర్టులో ఒక వ్యాజ్యం వేశారు. అంతేకాక సినిమాను రెండు ప్రధాన సామజిక వర్గాలను టార్గెట్ చేస్తూ వర్మ తీసారని, ఇటువంటి సినిమాలు రిలీజ్ అయితే కొన్ని రకాల వివాదాలకు కూడా కారణభూతంగా నిలిచే అవకాశం ఉందని, కాబట్టి సినిమాను రిలీజ్ చేయకుండా ఆపాలంటూ ఒక వ్యక్తి ఇటీవల హైకోర్ట్ లో పిటీషన్ వేయడం జరిగింది. అయితే అతడి పిటీషన్ మేరకు సినిమాను పరిశీలించిన కోర్ట్ అధికారులు, అందులోని కొన్ని అభ్యంతరకర సన్నివేశాలను తొలగించాల్సిందిగా ఇటీవల సినిమా యూనిట్ కు సమన్లు జారీ చేసారు. 

 

దానితో సినిమా యూనిట్ కొన్ని కత్తెర్లు వేసి కోర్ట్ కు సమర్పించింది. ఎట్టకేలకు వారి కత్తిరింపులు సరిగ్గానే ఉన్నాయని మెచ్చుకుని రిలీజ్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. కాగా ఈ సినిమాకు యు/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది సెన్సార్ బోర్డు. కొన్నాళ్ల క్రితం రిలీజ్ అయిన ఈ సినిమాలోని రెండు ట్రైలర్ లు కూడా చంద్రబాబు, జగన్, పవన్ కళ్యాణ్ వంటి పలు పార్టీల అధినేతలను విమర్శించే విధంగా ఉన్నాయని, అప్పట్లో కొద్దిపాటి వివాదాలు కూడా వచ్చాయి. అయితే తమ సినిమాలో ఎవరిని మేము విమర్శించలేదు, పూర్తి ఊహాజనితంగా మాత్రమే మేము ఈ సినిమాను తీస్తున్నాం అంటూ వర్మ చెప్పుకొచ్చారు......!! 

మరింత సమాచారం తెలుసుకోండి: