క్వీన్‌ పయనం  ఈనెల 14వ తేదీ నుంచి ప్రారంభంకానుంది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌కు ఉన్న డిమాండ్‌ ఏమిటన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దర్శకుడు విజయ్‌  బాలీవుడ్‌ సంచలన నటి కంగనారనౌత్‌ టైటిల్‌ పాత్రలో  తలైవి పేరుతో ఒక చిత్రాన్నీ  చిత్రీకరించబోతున్నాడు , నవ దర్శకురాలు  ప్రియదర్శిని చిత్రాలను  నటి నిత్యామీనన్‌ టైటిల్‌ పాత్రలో ది ఐరన్‌ లేడీ పేరుతో  తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. వీటిలో  ఇప్పటికే సెట్‌ పైకి  తలైవి చిత్రం వచ్చేసింది.కాగా వాటితో పాటు క్వీన్‌ పేరుతో వెబ్‌ సీరీస్‌ను  ప్రముఖ దర్శకుడు గౌతమ్‌మీనన్, ప్రసాద్‌ మురుగేశన్‌లు కలిసి  రూపొందిస్తున్నారు.రమ్యకృష్ణ  జయలలితగా నటించారు. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. రమ్యకృష్ణ జయలలిత గెటప్‌లో  బాగా నప్పిందనే ప్రశంసలు వస్తున్నాయి.

 

కాగా ఈ క్వీన్‌ సిరీస్‌ ప్రసారానికి టైమ్‌ ఫిక్స్‌ అయింది. ఈ నెల 14 నుంచి ప్రసారం కానున్నట్లు యూనిట్‌ వర్గాలు తెలిపాయి.  వెబ్‌ సిరీస్‌ క్వీన్‌ ఒక తెగింపు గల నటి, రాజకీయవాది, కాంప్రమైజ్‌ అనే పదానికి చోటు లేకుండా జీవించిన మనిషిగా రూపొందుతున్నది  .జయలలిత గురించి చెప్పాలంటే  బూడిద నుంచి ఉన్నత శిఖరాలకు చేరిన పీనిక్స్‌ పక్షిలా అతి పిన్న వయసులోనే ముఖ్యమంత్రి అన్న ఘనతకెక్కి తమిళనాడును ఏలిన వ్యక్తి .

 

సిరీస్‌ క్వీన్‌ చిత్రం ఆమె యదార్థ సంఘటనలతో రూపొందుతున్న సిరీస్‌ క్వీన్‌.ఈ వెబ్‌ సిరీస్‌ను  ఎంఎక్స్‌ ప్లేయర్‌ సంస్థ నిర్మిస్తున్నారు  ఈ చిత్రాన్ని తమిళం, హిందీ, బెంగాలీ భాషల్లో ఎంఎక్స్‌ యాప్‌లో ప్రసారం చేయనున్నట్లు యూనిట్‌ వర్గాలు తెలిపాయి. కాగా జయలలిత సోదరుడి కూతురు దీప  ఈ వెబ్‌ సిరీస్‌తో పాటు జయలలిత బయోపిక్‌తో తెరకెక్కనున్న చిత్రాలకుఅనుమతి ఇవ్వలేదు. అంతే కాదు ఆమె ఈ వ్యవహారంపై  కోర్టుకెక్కారు. అయినా క్వీన్‌ వెబ్‌ సిరీస్‌ను ప్రసారానికి సిద్ధం అవుతున్నారు.

 

దీంతో  దర్శక నిర్మాతలు సమస్యలు తలెత్తకుండా ఈ సిరీస్‌లో ఎక్కడా జయలలిత పేరును ప్రస్థావం లేకుండా జాగ్రత్త పడ్డారు. ఇందులో జయలలిత పాత్ర పేరును శక్తి శేషాద్రి అనే పెట్టారు. అలా చట్ట పరమైన సమస్యలు నుంచి క్వీన్‌ వెబ్‌ సిరీస్‌ బయట పడుతుందా? లేదా?అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: