బాహుబలి చిత్రం మొత్తం తెలుగు ఇండస్ట్రీకే గర్వ కారణంగా నిలిచింది. ఇన్ని దశాబ్దాలైన తెలుగు ఇండస్ట్రీ పాన్ ఇండియా సినిమాలు తీయలేక పోయింది. కానీ, బాహుబలి ఆ ముద్రని చెదరగొట్టి మొత్తం తెలుగు వాళ్ళు తలెత్తుకునే సినిమాగా నిలబడింది. కేవలం తను ఉన్న ఇండస్ట్రీనే కాదు.. మొత్తం భారత దేశం తమ వైపు చూసేలా చేసింది ఈ సినిమా. ఆ స్పూర్తితో కన్నడలో కూడా ఈ ఏడాది పాన్ ఇండియా సినిమా వచ్చింది అదే కెజిఫ్.

 

సినిమా ఇండియా వైడ్ సూపర్ హిట్ గా నిలిచింది . కన్నడ సంచలనం హీరో యశ్ కేజీఎఫ్ సినిమాతో  మొత్తం దేశాన్ని తన వైపుకు తిప్పుకున్నాడు. కన్నడ పరిశ్రమ అంటేనే రీమేక్ మూవీలు అలాగే లోబడ్జెట్ సినిమాలు గుర్తు వస్తాయి. కానీ మన బాహుబలి వల్ల వాళ్లు కూడా బాగా మారిపోయారు. ఒక్కసారిగా కెజిఫ్ సినిమాతో  వార్తల్లోకి ఎక్కింది కన్నడ పరిశ్రమ. రాజమౌళి సలహా మేరకు ప్యాన్ ఇండియా చిత్రంగా మలిచినట్టు పేర్కొన్న కేజీఎఫ్ అన్ని ఇండస్ట్రీల్లో సంచనాలు నమోదు చేసి సరికొత్త చరిత్ర రాసింది.

 

ఈ చిత్రం వసూళ్ల పరంగా దాదాపు 250 కోట్లు కొల్లగొట్టినట్టు తెలుస్తోంది. హిందీలో కేవలం డబ్బింగ్ సినిమాగా రిలీజై అక్కడి స్టార్ హీరోలకు ఆశ్చర్యపరిచింది.ప్రభాస్ లాగా యశ్  కూడా పాన్ ఇండియన్ స్టార్‌గా మారిపోయాడు.

 

సినిమా కలెక్షన్స్ విషయంలో ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్న కేజీఎఫ్.. తాజాగా మరో ఖాతాను సొంతం చేసుకుంది.2019 సంవత్సరంలో ఆన్లైన్ వెబ్ సైట్ అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన చిత్రాలలో అన్ని భాషలలో అత్యధికంగా వీక్షించిన సినిమాగా కేజిఎఫ్ రికాయేడు సృష్టించింది. కేజిఎఫ్ సినిమా డిజిటల్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ దక్కించుకోగా అత్యధిక వ్యూస్ సాధించి ఆ సంస్థకు మంచి లాభాలు తెచ్చి పెట్టింది ఈ సినిమా.

మరింత సమాచారం తెలుసుకోండి: